Telangana Assembly : విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఆరో రోజు శాసనభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చించిన విషయం తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 12:02 PMLast Updated on: Dec 21, 2023 | 12:02 PM

The Deputy Cm Released A White Paper On The Power Sector

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఆరో రోజు శాసనభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చించిన విషయం తెలిసిందే.

విద్యుత్ రంగం శ్వేత పత్రం..

దీన్ని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్ప కాలిక చర్చ మొదలైంది. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర సర్కార్ తెలిపిన విషయం తెలిసిందే.. అప్పులు, నష్టాలతో పాటు కరెంట్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ హయాంలో ఆర్థిక విధ్వంసం, వనరులు ఎలా దుర్వినియోగం అయ్యాయో వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేయాలని కాకుండా, రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన పెద్ద సవాల్ ఉందని చెప్పారు. కొందరికి చేదుగా ఉన్నప్పటికీ అందరూ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క వివరించారు.

విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. దానికి కౌంటర్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధమైంది. గత సమావేశంలో విమర్శలు-ప్రతివిమర్శలతో సభ హీటెక్కుతుంది. దీంతో ఇవాళ మళ్లీ అదీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండనుంది.