Directors As Villain: మనకి విలన్స్ కొరత తీరిపోయింది.. డైరెక్టర్లే విలన్స్.!
హీరోలు విలన్ క్యారెక్టర్లు చేసే రోజులు పోయాయి. దర్శకులే నెగిటివ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
తెరవెనుక వర్క్ చేసే దర్శకులు తెరపై కనిపించడం కొత్తేమీకాదు. కొందరు తమ సినిమాల్లో కామియో రోల్స్ లో నటిస్తే ఇంకొందరు ఇతర ప్రాజెక్ట్స్ లో అతిథులుగా మెరిసి ప్రేక్షకులను సర్ ఫ్రైజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ నచ్చి విలన్ రోల్ స్ట్రాండ్ గా ఉంటే దర్శకులే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు.
హీరోలు విలన్లుగా మారడం రొటిన్ అయిపోయింది. దర్శకులు విలన్ అవతారం ఎత్తాడం ట్రెండిగా మారింది. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారులోకం ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో క్లాస్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీకాంత్ నారప్ప లాంటి మాస్ ప్రాజెక్ట్ చేసి అందరిన్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు పవర్ ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్ తో పెదకాపు ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో శ్రీకాంత్ అడ్డాల నెగెటివ్ షెడ్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ముందుకు ఆ క్యారెక్టర్ కోసం మలయాళ నటుడ్ని సెలెక్ట్ చేశారు. అతను హ్యాండ్ ఇవ్వడంతో శ్రీకాంతే ఆ పాత్రలో నటించాల్సి వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల తర్వాత ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తున్న మరో దర్శకుడు కరుణ కుమార్. పలాస 1978 తో డైరెక్టర్ గా హిట్ కొట్టాడు కరుణకుమార్. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా మట్కా మూవీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న నా సామిరంగ ప్రాజెక్ట్ లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ లో కరుణ కుమార్ కి డైలాగ్స్ లేకపోయినా హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఖుషి మూవీతో డైరెక్టర్ గా మారిన ఎస్.జె సూర్య నెతియడి ప్రాజెక్ట్ తో నటుడిగా తెరంగేట్రం చేశాడు. మహేష్ స్పైడర్ లో విలన్ గా నటించిన తాను విలన్ పాత్రలకు కేరాఫ్ గా మారాడు. తాజాగా మార్క్ ఆంటోని లో విలన్ గా కనిపించిన ఎస్.జె.సూర్య జిగర్తండ డబుల్ ఎక్స్ ,రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో విలన్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.
బ్రో డెరెక్టర్ సముద్రఖని కూడా యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ గా మారిన వ్యక్తే. ఫస్ట్ టైం ఉన్నై చరణదైందెన్ సినిమాకి దర్శకత్వం వహించిన తాను పార్థలే పరవశంలో చిన్న పాత్ర పోషించాడు. ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే బన్నీ అల వైకుంఠపురములో, మహేష్ సర్కారు వారి పాట, నితిన్ మాచర్ల నియోజక వర్గం, ధనుష్ సార్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. కమల్ ఇండియన్2 లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.
నాగచైతన్య తో ఏమాయ చేసావె, వెంకటేష్ తో ఘర్షణ మూవీస్ చేసి హిట్ కొట్టిన గౌతమ్ మీనన్ కాఖా కాఖా, ఎన్నై అరింధాళ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో పోలీస్ అధికారిగా కనిపించి అలరించాడు. సందీప్ కిషన్ మైఖైల్ లో విలన్ గా నటించి మెప్పించాడు.ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విలన్ గా చేస్తున్నాడు. మొత్తానికి తెర వెనుక ఉండే దర్శకులు ఇప్పుడు తెరపై సందడి చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో విలన్స్ గా మారి ఆడియన్స్ లో ఆసక్తి ని రేకెత్తిస్తున్నారు.