Sai Pallavi: మరోసారి చైతూ తో సాయి పల్లవి
నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా ఎవరో ఒకర్ని పెడితే సరిపోదు. మాంచి పెర్‌ఫార్మర్ కావాలట. యాక్టింగ్‌తో మాత్రమే ఆకట్టుకునే ఇద్దరు హీరోయిన్స్ సాయిపల్లవి.. కీర్తిసురేష్ పేర్లు వినిపించాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియోలో హీరోయిన్ ఫేస్ దాచిపెట్టేసినా.. చైతుతో రొమాన్స్ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టేయొచ్చు.

The directors have chosen Sai Pallavi as the heroine in Naga Chaitanya's latest film
నాగచైతన్య పక్కన హీరోయిన్‌గా ఎవరో ఒకర్ని పెడితే సరిపోదు. మాంచి పెర్‌ఫార్మర్ కావాలట. యాక్టింగ్‌తో మాత్రమే ఆకట్టుకునే ఇద్దరు హీరోయిన్స్ సాయిపల్లవి.. కీర్తిసురేష్ పేర్లు వినిపించాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియోలో హీరోయిన్ ఫేస్ దాచిపెట్టేసినా.. చైతుతో రొమాన్స్ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టేయొచ్చు.
నాగచైతన్య నెక్ట్స్ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. చైతుతో ప్రేమమ్.. కార్తికేయ2 తీసిన చందు మొండేటి దర్శకుడు కావడంతో.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. జాలరి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఫిషర్‌మేన్ జీవన శైలి గమనించడానికి కథ కోసం.. చిత్ర యూనిట్ ఆమధ్య శ్రీకాకుళం వెళ్లి రీసెర్చ్ వర్క్ చేసింది.
నాగచైతన్యకు జోడీగా పెర్‌ఫార్మర్ కావాలి. చైతు హిట్ మూవీస్ అన్నింటిలోనూ.. హీరోయిన్స్‌కే ఎక్కువ పేరు వచ్చింది. నెక్ట్స్ మూవీ కోసం.. ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్స్‌ను పరిశీలించారు. ఒకరు సాయిపల్లవి అయితే.. మరొకరు కీర్తిసురేశ్. బైటకు చెప్పకపోయినా.. వీడియో చూస్తుంటే సాయిపల్లవిలా వుంది.
సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు. డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేయదు. కథ, క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తుంది. మొత్తానికి రెండేళ్ల తర్వాత తెలుగు కథకు ఫిదా అయిపోయిందన్నమాట. విరాటపర్వం తర్వాత గ్యాప్ తీసుకుని.. చైతుతో జత కడుతోంది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ మూవీ చేస్తోంది. ఈ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. చైతు సినిమా కోసం సాయిపల్లవికి భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పారు. కెరీర్‌లో ఫస్ట్ టైం హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుందట. ఇంతవరకు రెండు కోట్ల మీద వుండే సాయిపల్లవి ఫస్ట్ టైం 3 కోట్లు అందుకుందని తెలిసింది. ఈలెక్కన ఈ హైబ్రీడ్ పిల్ల టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పూజాహెగ్డే.. రష్మిక రెమ్యునరేషన్ దాటేసింది.