Prabhas: ప్రమోషన్ లేక పోయినా సలార్ కి సూపర్ హైప్
పెద్దగా ప్రమోషన్ లేకపోయినా.. అందరూ ఆ మూవీ కోసం వెయిట్ చేశారు. టీజర్‌తో సంబంధం లేకుండా.. కాంబినేషన్ అందరిలో ఎగ్జయిట్‌మెంట్ పెంచేసింది. అయితే అనుకోకుండా క్రేజ్ తగ్గుతోందా? సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడమే ఇందుకు కారణమా?
ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కాంబోలో సినిమా అని ఎనౌన్స్ చేయడం ఆలస్యం.. ఇండియా మొత్తం క్రేజీ ప్రాజెక్ట్ అయిపోయింది. సలార్ అన్న పవర్‌ఫుల్ టైటిల్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. టీజర్‌లో సలార్‌ను డైనోసార్‌తో పోల్చి మరింత హైప్ తీసుకొచ్చారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో వున్నా.. సలార్‌కు వచ్చినంత క్రేజ్ ఈమధ్యకాలంలో హీరో ఏ సినిమాకూ రాలేదు. అయితే.. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారా? సలార్‌పై ముందున్నంత ఇంట్రస్ తగ్గిందా? ఎందుకు ఈమధ్య వార్తల్లో నిలవడం లేదు? వీటన్నింటికీ చాలా కారణాలున్నాయి.
రిలీజ్ వాయిదా సలార్ హైప్‌కు బ్రేకులేసింది. సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ విఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో డిసెంబర్22కు వాయిదాపడింది. అదే రోజు కింగ్ ఖాన్ ‘దంకీ’ రిలీజ్ కావడంతో పోటీ మామూలుగా వుండదని తేలిపోయింది. పోస్ట్‌పోన్ ముందు వరకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగితే.. కాంపిటీషన్‌లో పడిపోవడంతో.. ముందు ఇస్తామన్న అమౌంట్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ నిరాకరిస్తున్నారు. సలార్ బిజినెస్ తగ్గిందన్న వార్తలొస్తున్నాయి.
టీజర్ రిలీజ్ తర్వాత సలార్ నుంచి పోస్ట్‌పోన్ వార్త తప్పితే మరో అప్‌డేట్స్ రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. ఎంతకాలం టీజర్‌తో నెట్టుకుస్తారు? తగ్గిన క్రేజ్‌ను పెంచాలంటే.. ఏదో ఒక అప్‌డేట్ బైటకు రావాలి. అలాంటి వాతావారణం ఇప్పట్లో కనిపించడం లేదు. దసరాకైనా ఏదో ఒకటి బైటకు తీసుకొస్తారో లేదో చూడాలి మరి.