Telangana Elections : నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. మూగబోనున్న మైకులు.. ఆగిపోనున్న ప్రచార రథాలు
నిన్న.. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో మైకులు బద్దలు అయ్యేలా.. ప్రసంగాలు ఇచ్చిన ప్రధాన పార్టీలు నేటి తో అన్ని మైకులు ముగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. పార్టీ నేతలు.. ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎందుకు అంటారా.. నేటితో ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది.

The election campaign will end today.. the microphones will be muted.. the campaign chariots will stop
నిన్న.. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో మైకులు బద్దలు అయ్యేలా.. ప్రసంగాలు ఇచ్చిన ప్రధాన పార్టీలు నేటి తో అన్ని మైకులు ముగబోనున్నాయి. ప్రచార రథాలు ఆగిపోనున్నాయి. పార్టీ నేతలు.. ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎందుకు అంటారా.. నేటితో ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 106 నియోజకవర్గాలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ప్రచారం అనంతరం ఇతర జిల్లాల నాయకులు, కార్యకర్తలు, తమ తమ నియోజకవర్గాలకు.. జిల్లాలకు వెళ్లిపోవాలిన సూచించింది. ఇక ఎన్నికల విజయానికి సహకరించాలని ఓటర్లను వేడుకున్నారు ఎలక్షన్ కమిటీ అధికారులు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2298 మంది పోటీ లో భరిలో ఉన్నారు.
నవంబర్ 30న జరిగే పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,298 మంది పోటిలో ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రం మొత్తం సైలెంట్ పీరియడ్లో కి వెల్లిపోతుంది. టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈసీ చూసించింది. ఇక ఎన్నికల ప్రచారం కోసం వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటల్లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.