Face Tagger: దొంగ ఓటర్లను గుర్తించే యాప్.. బీహార్ లో విజయవంతమైన ప్రయోగం

మన దేశంలో ఏడాదంతా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. గతంలో కొన్ని రాష్ట్రాల్లో సజావుగా ముగిసినప్పటికీ రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఫేస్ ట్యాగర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమౌతోంది. దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 10:40 AMLast Updated on: Aug 24, 2023 | 10:40 AM

The Face Tagger App Was Set Up In The Local Elections Held In Bihar

భారత్ లో చాలా రాష్ట్రాల్లో దొంగ ఓట్లు వేస్తూనే ఉంటారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి ఇలాంటి వారిని గుర్తించడం చాల కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఓటర్ కార్డ్, జాబితాలో ఒక రకమైన ఫోటో ఉంటే ఎలక్షన్ బూత్ కి వచ్చి ఓటు వినియోగించుకునే వ్యక్తి మరోలా ఉంటారు. దీనికి కారణం ఎన్నో ఏళ్ల క్రితం నాటి ఫోటోను ఓటర్ కార్డులో పొందుపరచడం. తద్వారా దొంగ ఓట్లను గుర్తించడం ఎన్నికల కమిషన్ కు పెద్ద సవాలుగా మారుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు చెన్నైకి చెందిన ఒక సంస్థ తాజాగా ఫేజ్ ట్యాగర్ అనే యాప్ ను రూపొందించారు.

10వేల దొంగ ఓటర్లను గుర్తించిన స్వదేశ్

ఈ యాప్ సహాయంతో గత రెండు నెలల క్రితం బీహార్ స్థానిక ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో 650 పోలింగ్ కేంద్రాలతో పాటూ మున్సిపాలిటీ ఎన్నికల్లో 1700 కేంద్రాల్లో స్వదేశ్ యాప్ ను ప్రయోగించారు. అందులో దాదాపు 10వేలకు పైగా దొంగ ఓటర్లను గుర్తించి రికార్డ్ సృష్టించింది స్వదేశ్ యాప్. దీంతో దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని భావిస్తోంది ఎన్నికల కమిషన్.

ఫేస్ ట్యాగర్ చరిత్ర

చెన్నైకి చెందిన విజయ్ జ్ఞానదేసికన్, ఇళంగో మీనాక్షిసుందరం దీనిని రూపొందించారు. 2018 లో ఫేస్ ట్యాగర్ అనే సంస్థను నెలకొల్పినట్లు తెలిపారు. ఇప్పటికే తమిళనాడుతోపాటూ పుదుచ్చెరి పోలీసు శాఖ అధికారులు వీరి సహాకారం తీసుకుంటున్నారు. నేరస్థులను గుర్తించడం, తప్పిపోయిన చిన్న పిల్లల వివరాలను డిజిటలైజ్ చేసి తమ తల్లిదండ్రులకు అప్పగించేందుకు దోహదపడుతోంది. అలాగే ఈ సాఫ్ట్ వేర్ ను ఇండియాలోని 7 ప్రదాన విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నట్లు సంస్థ అధినేత పేర్కొన్నారు.

పనితీరు భళా

  • ముందుగా ఎన్నికల విధులు నిర్వర్తించే వారు తమ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి
  • ఆ తరువాత ఈ మొబైల్ ను ఓటర్ల జాబితాతోపాటూ ఎలక్షన్స్ జరిపేందుకు అవసరమైన పరికరాలకు అనుసంధానం చేస్తారు.
  • ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వ్యక్తి ఫోటోను తీయాల్సి ఉంటుంది.
  • ఆ తరువాత ఓటరు వివరాలను అడిగి యాప్ లో నమోదు చేస్తారు.
  • కేవలం మూడు సెకన్ల వ్యవధిలో అతడు సరైన వ్యక్తేనా కాదా అన్న విషయాన్ని గుర్తిస్తుంది.
  • అలగే అతనికి దొంగ ఓట్లు వేసిన చరిత్ర ఏమైనా ఉందా అన్న విషయాన్ని కూడా చెప్పేస్తుంది.

ఇలా గుర్తిస్తుంది

ఓటరు కార్డులోని డేటా మొత్తం ఒక సాఫ్ట్ వేర్ రూపంలో నమోదు చేసి ఉంటారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యక్తి గతంలో ఎలా ఉండేవారు, భవిష్యత్తులో ఎలా మారుతాడో ముందుగానే పసిగడుతుంది. ఇలా గుర్తించేందుకు ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించామని ఫేస్ ట్యాగర్ సీఈవో విజయ్ జ్ఞానదేసికర్ వెల్లడించారు. ఒక వేళ ఓటర్ కార్డులో 5,10 ఏళ్ల క్రితం ఫోటోలు ఉన్నప్పటికీ అతని ప్రస్తుత ముఖాన్ని ఖచ్చితంగా గుర్తింస్తుందని తెలిపారు. దీనిపై అనేక పరిశోధనలు జరిపిన తరువాతే ఎన్నికల కమిషన్ బీహార్ లో ప్రయోగించినట్లు చెప్పారు.

T.V.SRIKAR