J&K : ఉగ్రవాద అణచివేతకు రంగం సిద్ధం.. అమర్నాథ్ యాత్రకు భద్రత పెంపు
జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది. గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు ఉగ్రదాడులు.. వరుస ఉగ్ర దాడుల్లో జమ్మూకశ్మీర్ చిగురుటాకులా వణికింది. దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉగ్ర దాడి జగరడం తీవ్ర కలకల రేపింది.

The field is ready to kill the terrorists.. Security has been increased for the Amarnath Yatra
జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది. గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు ఉగ్రదాడులు.. వరుస ఉగ్ర దాడుల్లో జమ్మూకశ్మీర్ చిగురుటాకులా వణికింది. దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉగ్ర దాడి జగరడం తీవ్ర కలకల రేపింది. అది కూడా వైష్ణవి దేవీ ఆలయ సమీపంలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, జమ్మూ-కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు.
ఈ సంవత్సరం లో ఉగ్రవాదులు నేరుగా యాత్రికుల.. టూరిస్టులు లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్ లోని ఓ పర్యటక బస్సుపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం సాయంత్రం కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ లో ఒక ఇంటిపై దాడిలు జరిగాయి. ఈ ఘటనతో భారత ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఏరివేత పై ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రియాసీ, కథువా, దోడా జిల్లాల్లో గతవారం ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
అమర్ నాథ యాత్రకు భద్రత పెంపు…
ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతపైనా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించారు. అమర్‌నాథ్ యాత్రికులు అందరికీ భద్రత కల్పించాలని మీటింగ్ లో చర్చించారు. కాగా అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19వ తేదీ వరకు జరగనుంది. గత సంవత్సరంలో 4 లక్షల 28 వేల మంది అమర్‌నాథ్ యాత్రకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకుపైగా యాత్రికులు రావచ్చని.. అంచాన వేశారు.
మరో వైపు యాత్రకు వచ్చిన యాత్రికులు రియల్ టైమ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు అందరికీ RFID కార్డులను అందజేయనున్నారు. ఈ యాత్రకు వచ్చే ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల వరకు బీమా కల్చించనున్నారు.