Salaar: దీపావళికే ప్రభాస్ దర్శనం
ప్రభాస్ మొన్న బర్త్ డేకి దర్శనం ఇవ్వలేదు. అసలు నెలగా తన జాడలేదు. కారణం తన మోకాళ్ల సర్జరీ తర్వాత ఫిజియో తెరపీకే అంకితం కావటం. అది కూడా యూరప్ లో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్లే, తన బర్త్ డేకి కూడా ఫ్యాన్స్ ని కలపలేకపోయాడు ప్రభాస్.

The film unit is trying to release the teaser of Salaar on Diwali
ప్రభాస్ మొన్న బర్త్ డేకి దర్శనం ఇవ్వలేదు. అసలు నెలగా తన జాడలేదు. కారణం తన మోకాళ్ల సర్జరీ తర్వాత ఫిజియో తెరపీకే అంకితం కావటం. అది కూడా యూరప్ లో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్లే, తన బర్త్ డేకి కూడా ఫ్యాన్స్ ని కలపలేకపోయాడు ప్రభాస్. ఐతే రెబల్ స్టార్ వచ్చేనెల ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాడు. నవంబర్ 10న ఫ్యాన్స్ ని మీట్ కాబోతున్నాడు. అది కూడా తన ఇంట్లోనే.. అందుకే తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే నవంబర్ 10నే ఫ్యాన్స్ కి ప్రభాస్ దర్శనం వెనక బలమైన రీజనుంది. సలార్ ట్రైలర్ ఆరోజే రానుంది.
సలార్ మూవీ ట్రైలర్ మొన్న దసరాకే రావాలి.. నిజానికి ట్రైలర్ రెడీ అయ్యింది. రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ టీం కూడా రెడీ అయ్యింది. కాకపోతే ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత ఇంకా కోలుకోలేదు. అలా తను నడవటానికి, నిలుచోడానికే ఇబ్బంది పడుతుంటే, అలాంటి పరిస్థితుల్లో ట్రైలర్ లాంచ్ చేయటం, ఆ ఈవెంట్ కోసం యూరప్ నుంచే ప్రభాస్ లైవ్ లో కనిపించే ఏర్పాటుచేసినా, నడవలేకపోవటం అన్న ఒక్కకారణంతో ట్రైలర్ లాంచ్ ఆపేశారట.
లేదంటే అక్టోబర్ 23 న బర్త్ డే స్పెషల్ గా ట్రైలర్ వచ్చేది. ఐతే నవంబర్ చివర్లో ఈ సినిమా ట్రైలర్ అంటూ ప్రచారం జరిగినా, దీపావళికి ముందే ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుస్తోంది. నవంబర్ 10న సలార్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారట. ప్రభాస్ ఇంట్లో నుంచే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగొచ్చని తెలుస్తోంది. మొత్తానిక పండక్కి రెండు రోజుల ముందే సలార్ ట్రైలర్ సందడి చేయటం కన్పామ్ అయ్యింది.