Leo’s title : “లియో” అనుకున్న టైంకి వస్తాడా.. ?

లియో.. లియో.. లియో.. దక్షిణాదిలో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ లియో. ఈ చిత్రంలో సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి జోడీగా త్రిష కథానయకిగా నటించింది. ఇక అర్జున్ సర్జా, బాలీవుడ్ స్టార్ విలన్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టించారు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కానీ అందరికీ ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా.. లేదా అని ప్రశ్న తల్లేత్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2023 | 03:14 PMLast Updated on: Oct 18, 2023 | 3:14 PM

The Film Will Be Released In Tamil As Well As Telugu On The 19th Of This Month Said Suryadevara Nagavamshi Producer Of Seethara Entertainment

లియో.. లియో.. లియో.. దక్షిణాదిలో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ లియో. ఈ చిత్రంలో సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి జోడీగా త్రిష కథానయకిగా నటించింది. ఇక అర్జున్ సర్జా, బాలీవుడ్ స్టార్ విలన్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టించారు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కానీ అందరికీ ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా.. లేదా అని ప్రశ్న తల్లేత్తుంది.

“లియో” వివాదం ఏంటీ .. ?

లియో టైటిల్ తో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా లియో టైటిల్ తమదంటూ విజయవాడకు చెందిన ఓ నిర్మాత సంస్థ లియో మూవీ సంస్థతో ఎలాంటి సంప్రద్దింపుల జరపకుండా నేరుగా కోర్టుకెళ్లింది. “తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. టైటిల్ ని వేరొకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. చెప్పుకొచ్చారు నిర్మాత నగవంశీ. నిజానికి.. లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారు. లియో చిత్రం పై తెలుగు వెర్షన్‌ రిలీజ్‌పై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఉన్న చిక్కుల నేపథ్యంలోనే హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ‘లియో‘ అక్టోబర్‌ 19న విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతటా రికార్డు స్థాయిలో అవి అమ్ముడవుతు బుకింగ్ కూడా దాదాపు అయిపోయి వచ్చాయి. ఈ చిత్రం మొదటి రోజు రూ.100 కోట్లు వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

లియో విడుదల పై ఏలాంటి మార్పు ఉండాదు..!

ఈ సందరంగా సూర్యదేవర నాగవంశీ విలేకరులతో మాట్లాడుతూ ‘లియో’ సినిమా విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు.. ఈ నెల 19నే తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజవుతుంది” అని సీతార ఎంటర్టైన్మెం నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఈ సినిమా ఈ నెల 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ చిత్రం తెలుగు హక్కులను సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ‘లియో’ తెలుగు టైటిల్ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారు. “లియో” సెన్సార్ కూడా పూర్తయింది.. విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ సినిమా బాగుంటుందనే నమ్మ కంతోనే తెలుగు హక్కులు తీసుకున్నాను” అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

గత వారంలో లియో చిత్రంలో సొంత రాష్ట్రాల్లోనే బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రా వ్యాప్తంగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. రెండు రాష్ట్రాలో రెండు వివాదాలు..

గతంలో కూడా విజయ్ సినిమాలు తెలుగులో విడుదలకు ముందు చాలా చిక్కులు వచ్చాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు చిత్రం కు కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఇద్దరు స్టార్ రెండు పెద్ద తెలుగు సినిమాలు విడుదల అవుతుంటే తమిళం సినిమా అయిన వారసుడు ఈ రోజు విడుదల చేయకుడదని తెలుగులో కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. తెలుగులో విజయ్ సినిమాను విడుదలకు తెలుగు వాళ్ళు అండక్కుల సృష్టిస్తే .. మీ తదుపరి తెలుగు చిత్రాలను మా తమిళనాడు లో విడుదల చేయబోమని ఏకంగా తెలుగు ఇండస్టీకి లేఖ రాశారు తమిళ ప్రొడ్యూసర్. విజయ్ నటించిన వారసుడు చిత్రం కు నిర్మాతగా ఉన్నది తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. నిర్మాతల మాటలను లెక్క చేయకుండా ఒక రోజు వ్యవధిలో సినిమాను రిలిజ్ చేశారు.

S.SURESH