TDP-Janasena : నేడు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఇంకా సరైన స్పష్టత రాలేదు.
అమరావతి : పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఇంకా సరైన స్పష్టత రాలేదు. టీడీపీ-జనసేన పార్టీలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి.. అన్న ప్రశ్నకు.. ఎవరు పోటీ చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. నేడు టీడీపీ-జనసేన (TDP-Janasena) తొలి అడుగు వేయబోతున్నారు. రెండు పార్టీల కూటమిలో భాగంగా మరి కాసేపట్లో ఇరు పార్టీల తొలి జాబితాను సిద్ధం విడుదల చేయబోతున్నాయి. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గాల అభ్యర్థులను విడుదల సందర్భంగా ఇరు పార్టీల
ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. కాగా తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. తొలి జాబితాలో 60 నుంచి 70 సీట్లకు ఇరు పార్టీల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాను టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు విడుదల చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం.