Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరం లో అసెంబ్లీ ఎన్నికల ఇవాళ పోలింగ్.. ఛత్తీస్ గఢ్ , మిజోరంలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 7, 2023 | 11:37 AMLast Updated on: Nov 07, 2023 | 11:37 AM

The First Phase Of Assembly Elections In Five States Has Started Today Chhattisgarh Mizoram Assembly Election Polling Today Do You Know The Number Of Voters In Chhattisgarh Mizoram

దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections)  పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.

మిజోరం ( Mizoram) అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్ల కోసం 174 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మిజోరంలో మొత్తం 8,53,088 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,39,028 మంది మహిళలు 4,13,064 మంది పురుషులు ఉన్నారు. 80ఏళ్లు పైబడిన వారు 8,490మంది ఉన్నట్లు ఈసీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1276 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక మిజోరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజీ ఫిగర్ 21 సీట్లు. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్​ ఫ్రెంట్​ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 26 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్​కు ఐదు సీట్లు, బీజేపీకి ఒక్క సీటు వచ్చింది.

ఛత్తీస్ గఢ్ లో ఇవాళ తొలి దశ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా చర్యలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్ నంద్ గావ్ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,78,681 మంది ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. విరిలో 20,84,675 మంది మహిళలు, 19,93,937 మంది పురుషులు, 69 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఛత్తీస్ గఢ్ ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్ గా విభజించారు మొదటి స్లాట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు .. రెండో స్టాట్ దశ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగి ముగిస్తుంది..

Narendra Modis : నేడు తెలంగాణలో నరేంద్రమోదీ పర్యటన.. ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో సభ.

ఏ పార్టీ నుంచి ఎంత మంది అభ్యర్థులు పోటీ.. ?

ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లో తొలి దశ ఓటింగ్ లో బీజేపీ నుంచి 20 మంది అభ్యర్థులు పోటీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది అభ్యర్థులు పోటీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ.. బీఎస్సీ కి 15 మంది అభర్థులు పోటీ.. జేసీసీ (జే)కి చెందిన 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఒక్క రాజ్ నంద్ గావ్ స్థానం నుంచి 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక మరో వైపు చిత్రకోట్, దంతెవాడలో 7 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు.

ఛత్తీస్ గఢ్ లో మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు ..

అధికార కాంగ్రెస్ పార్టీ (Congress party) ఛత్తీస్‌గఢ్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్), మోహన్ మార్కం (కొండగావ్), మహ్మద్ అక్బర్ (కవార్ధా), మంత్రులు కవాసీ లఖ్మా (కొంటా), ఛవీంద్ర కర్మతోపాటు పలువురు ముఖ్యనేతలు ఉన్నారు.

బీజేపీ (BJP) పార్టీకి చెందిన వారిలో.. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మాజీ మంత్రులు లతా ఉసెండి విక్రమ్ ఉసెండి (అంతగఢ్), (కొండగావ్ నియోజకవర్గం), కేదార్ కశ్యప్ (నారాయణపూర్), మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ్ టేకం (కేష్కల్) మహేష్ గగ్డా (బీజాపూర్), ముఖ్యమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.

Telangana Politics : గాడిదపై వచ్చి నిరుద్యోగి నామినేషన్‌.. తరువాత ఏమైందంటే..

ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లపై ఓటింగ్.. జిల్లా సీట్లు

  • నారాయణపూర్ – 1
  • రాజంర్గావ్ 6
  • దంతేవాడ – 1
  • బీజాపూర్ – 1
  • కాంకర్ – 3
  • కొండగావ్ – 2
  • బస్తర్ – 3

ఇక.. మిగిలిన 70 సీట్లకు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఛత్తీస్ గఢ్ ఎన్నికల మొదటి దశ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులో 46 మంది కోటీశ్వరుల ఉన్నారు.

SURESH