General Elections : దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్..
దేశంలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ కోనసాగుతుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ కోనసాగుతుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లకు.. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లకే పోలింగ్ కోనసాగుతుంది. ఈ పోలింగ్ కేంద్ర బలగాలతో పాటుగా.. రాష్ట్రా పోలిస్ యాంత్రాగం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అయిన ఆదిలాబాద్, భద్రాద్రి, ఖమ్మం, ములుగు, ఏపీలో మన్యం, అరకు, చిత్తురు, నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఏపీ వ్యాప్తంగా 4 కోట్ల పైచిలుకు ఓటర్లు..
ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651 (74.70 శాతం). ఇక పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్‌లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ వ్యాప్తంగా 3.32 ఓటర్లు..
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ దఫాలో తెలంగాణలోని మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్దసంఖ్యలో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక్కడ పోలింగ్ టైం కుదింపు..
ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
Suresh SSM