Olympic Gold Medal : గోల్డ్ మెడల్ లో బంగారం ఎంతంటే.. ?
ఒలింపిక్స్ (Olympic) లో విజేతలకు ఇచ్చే గోల్డ్ మెడల్ లో మొత్తం బంగారమే ఉంటుందా...అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం ఉండదు.
ఒలింపిక్స్ (Olympic) లో విజేతలకు ఇచ్చే గోల్డ్ మెడల్ లో మొత్తం బంగారమే ఉంటుందా…అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం ఉండదు. కొంత మొత్తంలో మాత్రమే పసిడి ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ (International Olympic) కమిటీ నిబంధనల ప్రకారం.. బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5% వెండిని కలిగి ఉండాలి. అలాగే 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో పూత పూయాలి. అదేవిధంగా తక్కువ ఖర్చు కారణంగా వెండి పతకాలు పూర్తిగా వెండితో (Silver Scheme), కాంస్య పతకాల (Bronze Scheme) ను స్వచ్ఛమైన రాగితో తయారు చేస్తారు. ఒలింపిక్ కమిటీ అన్ని పతకాల పరిమాణం, బరువును కూడా సెట్ చేసింది. బంగారు పతకం మొత్తం బరువు 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు, కాంస్య పతకం బరువు 455 గ్రాములుగా ఉంటుంది.