AP Volunteer System : వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా.. తుంచాలా.. ఏది బెటర్.. ఏం చేస్తే బెటర్..
ఏపీలో ప్రభుత్వం మారింది. దీంతో పరిస్థితులు మారుతున్నాయ్.. విధానాలు మారుతున్నాయ్. నినాదాలు మారుతున్నాయ్. ఓవరాల్‌గా వ్యవస్థే మారుతోంది.

The government has changed in AP. With this, the conditions are changing.. the procedures are changing. Slogans are changing. Overall the system is changing.
ఏపీలో ప్రభుత్వం మారింది. దీంతో పరిస్థితులు మారుతున్నాయ్.. విధానాలు మారుతున్నాయ్. నినాదాలు మారుతున్నాయ్. ఓవరాల్‌గా వ్యవస్థే మారుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వాలంటీర్ వ్యవస్థపై జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్.. చాలా ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఐతే ఎన్నికల ముందు వాలంటీర్ల విధులపై ఈసీ నిబంధనలు విధించడం.. వాలంటీర్లు చాలావరకు రిజైన్ చేయడం చకచకా జరిగిపోయాయ్. ఐతే ఆ వ్యవస్థను కంటిన్యూ చేయడమే కాదు.. జీతం కూడా పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థపై మాత్రం క్లారిటీ లేదు. పెన్షన్ల పంపిణీకి కూడా సచివాలయ సిబ్బందిని యూజ్ చేసుకుంది సర్కార్.
దీంతో అసలు వాలంటీర్లు ఉంటారా లేదా అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం ఏంటి.. వాళ్లను ఉంచాలా… తుంచాలా.. ఏం చెస్తే బెటర్.. ఏది చేస్తే బెటర్.. ఎలా చేస్తే బెటర్ అనే డిస్కషన్ మొదలైంది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పరిచయం చేసిన అప్పటి సీఎం జగన్.. వాలంటీర్ వ్యవస్థను రూపొందించారు. పాలనా సంస్కరణల్లో భాగంగా పరిపాలనా వ్యవస్థల్ని గ్రామస్థాయికి చేర్చామని అప్పటి సర్కార్ గొప్పలు చెప్పుకున్నా అందులోనూ లోపాలున్నాయ్. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎలాంటి మార్పులు రాలేదన్నది చాలామంది అభిప్రాయం. ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు.
ఎన్నికల సమయంలో వచ్చిన అభ్యంతరాలతో.. ప్రభుత్వ విధుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను నియమించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో… అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. దాదాపు లక్ష మందికి పైగా రాజీనామాలు చేశారు. వైసీపీ నేతలతో ప్రచారంలో కనిపించారు కూడా ! ఐతే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో వాలంటీర్లు టీడీపీ ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రాజీనామాలు చేశామని తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్కడే అసలు చర్చ స్టార్ట్ అయింది. వాలంటీర్ వ్యవస్థపై.. కూటమి సర్కార్ పెద్దల నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. వాలంటీర్లు లేనంత మాత్రాన.. పెన్షన్ పంపిణీ ఆగిపోయిందా.. ఈ మాత్రం దానికి వారు అవసరమా అన్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడిన మాటలు.. కొత్త చర్చకు దారి తీస్తుండగా.. అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభనష్టాలపై కొత్త చర్చ జరుగుతోంది. నిజానికి వాలంటీర్ వ్యవస్థనే తప్పుడు ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. వైసీపీ తరఫున నిజానికి అది ఒక నిఘా వ్యవస్థలా పనిచేసింది. దాదాపు అందరూ వైసీపీ సానుభూతిపరుల్లాగానో, కార్యకర్తల్లాగానో పనిచేశారు. స్వయంగా వైసీపీ నాయకులే ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో వేదిక మీద బహిరంగంగా ప్రకటించారు కూడా ! అలాంటప్పుడు వారిని కొనసాగించడంలో అర్థం ఉందా.. ఆ వ్యవస్థను తొలగిస్తే తప్పేంటి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
రెండున్నర లక్షల వాలంటీర్లలో దాదాపు సగం మంది రిజైన్ చేశారు. మిగతా సగం మందిని కూడా తీసేసి.. సచివాలయం సిబ్బందికి వాలంటీర్లు చేసే పనిని అప్పగిస్తే సరిపోతుంది. దీనివల్ల రెండు ఉపయోగాల ఉంటాయ్. ఒకటి.. సచివాలయ సిబ్బందికి పూర్తి స్థాయిలో పని దొరుకుతుంది. రెండు.. దాదాపు 75కోట్ల ప్రజాధనం మిగులుతుంది. ఐతే ఉన్న ఫళంగా వారిని తీసేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి… ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కరెక్ట్. వారిలో అర్హులైన వారిని గుర్తించి వారికి ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి… తద్వారా వారు మరెక్కడైనా స్థిర పడేలా చేయొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.