Israel Vs Hamas War: హమాస్-ఇజ్రాయెల్ యుద్దం మరింత ఉధృతం.. ఎవరికి ఎవరు మద్దతుగా నిలిచారు?

ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ‎ఖండిస్తూ 84 దేశాలు తమకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కేవలం రెండు దేశాల మధ్య జరిగే యుద్దానికి మరో రెండు దేశాలు మద్దతు ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరికి ఏ దేశం మద్దతు ఇస్తుందో చూసేద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 11, 2023 | 12:04 PMLast Updated on: Oct 11, 2023 | 12:04 PM

The Hamas Israeli War Is Getting More Intense Which Country Is Supporting Whom

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న భీకర యుద్దం జరుగుతోంది. ఇందులో దాదాపు మూడు వేల మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పైగా ఈ వివాదాన్ని సర్థుమణిగే చర్యలకు ఇరుదేశాలు ఎక్కడా పూనుకోవడంలేదు. ఒకరిని మించి ఒకరు మిలిటెంట్లతో దాడి చేస్తుకుంటున్నారు. దీంతో ఇజ్రాయెల్ తో పాటూ పాలస్తీనా కూడా మారణ హోమాన్ని సృష్టించింది. దీనికి కారణం కొన్ని దేశాలు పాలస్తీన్లకు పరోక్షంగా మద్దతుగా నిలిచాయి అన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఇజ్రాయెల్ పక్షాన నిలిచిన దేశాలు..

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ‎ఖండిస్తూ 84 దేశాలు తమకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. మన్నటి వరకూ ఇజ్రయెల్ కు అమెరికా మాత్రమే మద్దతుగా ఉన్నట్లు, పాలస్తీన్లకు ఇరాన్ సహకరిస్తున్నట్లు మాత్రమే తెలిసింది. తాజాగా ఏఏ దేశాల మద్దతు ఎవరికి ఉందనే అంశాన్ని పరిశీలిస్తే అందులో అగ్రదేశాలు చాలా వరకూ ఇజ్రాయెల్ పక్షాన నిలిచినట్లు తెలుస్తోంది.

అమెరికా..

ఇజ్రాయెల్-పాలస్తీన్ల దాడుల వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంది. హమాస్ దాడిని తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో పాటూ అవసరమైన సైనిక బలగాలను, రక్షణ సిబ్బందిని తరలించేందుకు సిద్దమైనట్లు వెల్లడించారు. మారణాయుధాలు, మందుగుండు సామాగ్రితోపాటూ 2000 మంది సైనుకులు ఇప్పటికే ఇజ్రాయెల్ చేరుకున్నట్లు తెలిపారు. యుద్దం పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయగల ప్రత్యేక ఫైటర్ జెట్ సిబ్బందిని పంపించింది. అవసరాన్ని బట్టి మరో 3000 మంది సైనికులను, యుద్దనౌకలను కూడా పంపేందుకు అగ్రరాజ్యం సిద్దమైంది. దీంతో అమెరికాతో సత్సంబంధాలు నెలకొల్పే దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపాయి.

ఇండియా..

ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఘటనలు యావత్ భారత దేశం చూసిందని నాతో సహా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి మద్దతు ఇజ్రాయెల్ కి ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్లో సంభాషించిన మోదీ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

ఇంగ్లాండ్..

ఇజ్రాయెల్-పాలస్తీన్ల యుద్దంపై బ్రిటన్ ప్రధాని రుషి సునక్ స్పందించారు. హమాస్ చేసిన దాడిని తప్పుబట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ కు అవసరమైన సహాయక, రక్షణ చర్యలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే మద్దతుగా నిలుస్తామని ధైర్యాన్నిచ్చారు.

ఆస్ట్రేలియా..

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే హమాస్ కంటే ఇజ్రాయెల్ తీవ్రమైన దాడికి పాల్పడింది. ఇలా ఒకరికొకరు యుద్ద పరిస్థితులను ఉదృతం చేస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా భిన్నంగా స్పందించింది. ఈ విష‍యంలో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరింది. గాజాలో నివసించే సామాన్యులను దృష్టిలో ఉంచుకుని హింసను తగ్గించాలని ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్ సూచించారు. అలాగే హమాస్ చేసిన చర్యలను తప్పుబట్టింది. తన మద్దతు ఇజ్రాయెల్ కే ఉంటుందని స్పష్టం చేసింది.

నార్వే..

ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన చాటు యుద్దాన్ని నార్వే తీవ్రంగా ఖండిస్తూ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచింది. దీంతో పాటూ మిగిలిన దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, స్పెయిన్, పోలండ్ తోపాటూ తదితర యూరోపియన్ యూనియన్ దేశాలు తమ మద్దతును ప్రకటించాయి.

ఫ్రాన్స్..

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ హమస్ చర్యలు సరైనవి కాదన్నారు. దీనిని తమ దేశం తీవ్రంగా ఖండిస్తోందని ఇజ్రాయెల్ కి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ పౌరుల హక్కులను కాపాడటంతోపాటూ వారికి రక్షణ కల్పించడంలో ఫ్రాన్స్ ముందుంటుందని సంఘీవావం వ్యక్తం చేశారు.

హమాస్ చర్యలను మద్దతిస్తున్న దేశాలు..

ప్రపంచంలో అగ్రదేశాలతో సహా మరి కొన్ని చిన్న దేశాలు ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడిని ఖండిస్తుంటే కొన్ని అరేబియన్ దేశాలు మద్దతు ఇస్తూ వారి చర్యలను సమర్థిస్తున్నాయి.

ఇరాన్..

ఇరాన్ కు ఇజ్రాయెల్ అంటే అస్సలు పడదు. పైగా ఈ ఇరు దేశాలకు ఎలాంటి సత్సంబంధాలు లేవు. గతంలో నుంచే పాలస్తీన్ల వైపు నిలిచి వాళ్ల వాదానికి మద్దతు ఇస్తూ ఉండేది. దీనికి కారణం ఇరాన్ మద్దతు ఉన్న మరో సమూహం హెజ్ బొల్లా ప్రస్తుతం లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ తో పోరాడుతోంది. ఈ సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేయడం చాలా గొప్ప విజయంగా భావిస్తూ వారికి మద్దతు ఇచ్చారు.

ఖతార్..

2012 నుంచి హమాస్ రాజకీయాలకు వేదికగా నిలుస్తోంది ఖతార్. అందుకే ఇజ్రాయెల్ పై పాలస్తీన్లు చేసిన దాడికి మద్దతిచ్చింది. పైగా కౌంటర్ అటాక్ కూడా చేసింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ పాలకులు చేసిన అనుచిత ప్రవర్తనే ఈ యుద్ద పరిస్థితులకు కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఖతార్ తో పాటూ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, లెబనాన్ దేశాలు పాలస్తీనియన్ల చర్యలను సమర్థించాయి.

సౌదీ అరేబియా..

సౌదీ అరేబియా ద్వంద వైఖరిని అవలంభిస్తోంది. పాలస్తీనా చేస్తున్న మిలిటెంట్ల దాడిని ప్రోత్సహిస్తూనే.. ఇజ్రాయెల్ కి తమ దేశం వ్యతిరేకం కాదని చెబుతోంది. దీనికి కారణం ఇరుదేశాల మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాలే కారణం అని చెబుతున్నరు పరిశీలకులు. అందుకే హమాస్ తనపై దాడి చేస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా..

పాలస్తీనియన్లు అధికారంలో ఉన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హమాస్ కు దక్షిణాఫ్రికా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం పాలస్తీనియన్లు నివసించే సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భద్రతా బలగాలు మొహరించి ఉన్నట్లు తెలిపింది. అందుకే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

T.V.SRIKAR