Canada War Effect On IT: కెెనడా – భారత్ మధ్య ఉద్రిక్తల ప్రభావం ఐటీ సంస్థల పై పడుతుందా..? ప్రముఖ టెక్ సంస్థలు ఏం సూచిస్తున్నాయి..?
కెనడా-ఇండియా మధ్య వార్ ముదిరిన నేపథ్యంలో దీనిప్రభావం సాంకేతిక రంగాలపై పడుతుందని కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు. నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

The impact of the situation arising between India and Canada will have an impact on the IT sector
కెనడా-ఇండియా మధ్య వార్ ముదిరిన నేపథ్యంలో ఇవి వేటిపై ప్రభావం చూపుతాయన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. కేవలం ఆ దేశ ప్రధాని రాజకీయ ప్రయోజనాలకు ఇలా అశాంతిని రగిలించడం సరైన పద్దతి కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే దీనిప్రభావం సాంకేతిక రంగాలపై పడుతుందని కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ రకమైన వార్తలు వస్తున్న తరుణంలో ఐటీ కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని మరి కొందరు సాంకేతిక రంగ నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా మూడు ప్రదానమైన దిగ్గజ కంపెనీల అంశాలను వెల్లడించారు.
కెనడా-ఇండియా ఉద్రిక్త వాతావరణంలో ఐటీ సంస్థల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. మన దేశానికి కెనడా నుంచి ఐటీ సంస్థల నుంచి వచ్చే ఆదాయం 5 నుంచి 6 శాతం మాత్రమే ఉందంటున్నారు టెక్ నిపుణులు. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ కెనడా టెక్ నెట్ వర్క్ కొన్ని గణాంకాలను సూచించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే దాదాపు 15వేల మందికి పైగా ఉద్యోగాలు చేసేందుకు కెనడా బాట పట్టారు. సాధారణంగా మన దేశం నుంచి ఐటీ ఉద్యోగం అనగానే ఏ అమెరికాకో, ఆస్ట్రేలియాకో అధికంగా వెళ్తూ ఉంటారు. కానీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అమెరికా వీసాల్లో జాప్యం జరిగింది. దీంతో కెనడాకు ప్రయాణించారు సాప్ట్ వేర్ ఉద్యోగులు.
ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సంఖ్యను పెంచడం
2023, జూలైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డైన్ సబ్సిడరీ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ నూతన విధానం ద్వారా వచ్చే ఏడాది నుంచి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అంటే క్రమక్రమంగా ఐటీ రంగం ఊపందుకుంటుందే తప్ప పతనం అవ్వదని కంపెనీలు పరోక్షంగా తమ ఉద్యోగుల నియామకం ద్వారా తెలుపుతున్నాయి.
టీసీఎస్ కూడా సరికొత్త ఆవిష్కరణలు
ఇదే బాటలో టీసీఎస్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి లో డిజిటలైజేషన్ విస్తృతిని, వేగాన్ని పెంచుకోవడంతో పాటూ సరికొత్త ఆవిష్కరణలు ప్రారంభించడానికి సిద్దమైంది. ఇందుకోసం కెనడియన్ జెట్ తయారీదారులైన బొంబార్డియర్ ద్వారా స్టార్టజికల్ పార్ట్ నర్ షిప్ ను కొనసాగించేందుకు ఎంపికైంది. తద్వారా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
విప్రో కఎరోస్పేస్ రంగంలోకి అడుగు
కెనడాలోని టొరంటోలో విప్రో ఏడబ్యూఎస్ లాంచ్ ప్యాడ్ సెంటర్ ను 2024 జనవరిలో ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ఇటీవలె ప్రకటించింది. గతంలో మహేంద్రా అండ్ మహేంద్రా కు అనుబంధ సంస్థగా ఉన్న రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ ను స్వచ్ఛందంగానే విరమించుకుంటున్నట్లు కెనడా కార్పొరేషన్ కు అర్జీ పెట్టుకుంది. ఈ స్థానంలోకి విప్రో వచ్చి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సాంకేతిక రంగం నుంచి ఎయిర్ సర్వీసుల వైపుకు అడుగులు వేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.
T.V.SRIKAR