కదంతొక్కిన స్మృతి వన్డే సిరీస్ మనదే
సొంతగడ్డపై భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో కివీస్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.

సొంతగడ్డపై భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓటమికి న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో కివీస్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టును భారత బౌలర్లు 232 రన్స్ కే కట్టడి చేశారు. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లతో రాణించారు. ఛేజింగ్ లో స్మృతి మంధాన సెంచరీతో కదం తొక్కింది. అటు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత మహిళల జట్టు మరో 5.4 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ ఛేదించింది. స్మృతి మంధాన 100 , హర్మన్ ప్రీత్ 59 పరుగులు చేశారు.