I Phone 15: ఇస్రో టెక్నాలజీతో పని చేస్తున్న ఐఫోన్ 15
అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీ నుంచి ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు. ఎగబడి మరీ కొంటుంటారు. రీసెంట్‌గా యాపిల్ సిరీస్‌లో ఐఫోన్ 15 రిలీజ్ అయ్యింది.
ఐఫోన్ అంటే యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీ నుంచి ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు. ఎగబడి మరీ కొంటుంటారు. రీసెంట్‌గా యాపిల్ సిరీస్‌లో ఐఫోన్ 15 రిలీజ్ అయ్యింది. ఇంతకు ముందు ఉన్న అన్ని మోడల్స్‌ను తలదన్నేలా.. కొత్త ఐఫోన్‌ను రిలీజ్ చేసింది యాపిల్ కంపెనీ. మ్యాపింగ్ విషయంలో భారీ మార్పులు చేసింది. ఇప్పటి వరకూ నెంబర్ వన్‌గా ఉన్న గ్లోబల్ పొజిషన్‌నింగ్ సిస్టమ్-జీపీఎస్‌ను మార్చి.. ఇస్రో తయారు చేసిన నావిక్ వ్యవస్థను ఉపయోగించింది. కార్గిల్ యుద్ధం తరవాత సొంత నావిగేషన్ వ్యవస్థను తయారు చేసుకునేందుకు ఇస్రో ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
ఏడేళ్ల పరిశోధన తరువాత 2013లో ఫస్ట్ నేవిగేషన్ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది భారత్. ఆ తరువాత మరో 6 శాటిలైట్లను విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం 1450 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు రష్యా ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఈ నావిక్ వ్యవస్థ కేవలం భారత్‌లోనే కాకుండా చుట్టుపక్కల 15 వందల కిలో మీటర్ల పరిదిలో కూడా పని చేస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో దీన్ని మొదట ఉపయోగించారు. కొన్ని రోజుల్లోనే జీపీఎస్ కంటే ఖచ్చితంగా నేవిగేషన్ అందించగలిగింది నావిక్. జీపీఎస్‌లో లొకేషన్ 20 మీటర్ల వ్యవధిలో అటూఇటూగా చూపిస్తుంది. కానీ నావిక్‌లో మాత్రం అక్యూరసీ లిమిట్ కేవలం 5 మీటర్లు. అంటే 99 శాతం మీరు ఉన్న ప్లేస్‌ను, మీరు వెతకాలనుకుంటున్న ప్లేస్‌ను ఖచ్చితంగా చూపిస్తుంది.
ఇంత ఖచ్చితంగా పని చేస్తోంది కాబట్టే ఐఫోన్ 15 జీపీఎస్‌ను పక్కన పెట్టిన నావిక్ వ్యవస్థతో పని చేసేలా కొత్త మోడల్‌ను తయారు చేసింది. ప్రస్తుతం మనం వాడుతున్న జీపీఎస్ వ్యవస్థ కొండ ప్రాంతాల్లో పని చేయదు. కానీ నావిక్ అక్కడ కూడా ఖచ్చితంగా దారి చూపిస్తుంది. ఈ నావిక్‌ను మనం వాడుతున్న గూగుల్ మ్యాప్స్ అనుసంధానం చేస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా అన్ని దార్లు క్లియర్‌గా మ్యాప్స్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికే మహీంద్రా, మారుతీ సంస్థలు నావిక్‌తో పనిచేసే కార్లను రిలీజ్ చేశాయి. 2025కల్లా దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లు నావిక్ వ్యవస్థతోనే పని చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రానున్న కొత్త ఫోన్లు అన్నీ నావిక్‌తోనే పని చేయబోతున్నాయి.