RTC Bus : ఆర్టీసీ బస్సు టాప్ పై విద్యార్థుల ప్రయాణం.. అలాగే బస్సు నడిపిన డ్రైవర్
బస్సు ప్రయాణాలు చేసేవారికి టికెట్ ధరతో పాటు.. బస్సు ప్రయాణించవలసిన రూల్స్, నియమాలు కూడా తెలిసి ఉండాలి. తెలియని వారికి బస్సు డ్రైవర్ గానీ.. కండెక్టర్ గానీ ప్రయాణికులకు లేదా చిన్న పిల్లలకు చెప్పాలి. సాధారణంగా బస్సుల సీటు ఖాళీ లేకపోతే నిల్చొని వెళ్తాము.. మరీ బస్సు రద్దీగా ఉంటే వేరొక బస్సు కోసం ఆగుతాము.
బస్సు ప్రయాణాలు చేసేవారికి టికెట్ ధరతో పాటు.. బస్సు ప్రయాణించవలసిన రూల్స్, నియమాలు కూడా తెలిసి ఉండాలి. తెలియని వారికి బస్సు డ్రైవర్ గానీ.. కండెక్టర్ గానీ ప్రయాణికులకు లేదా చిన్న పిల్లలకు చెప్పాలి. సాధారణంగా బస్సుల సీటు ఖాళీ లేకపోతే నిల్చొని వెళ్తాము.. మరీ బస్సు రద్దీగా ఉంటే వేరొక బస్సు కోసం ఆగుతాము. కొందరు కాలేజీ స్టూడెంట్స్, ఆకతాయులు బస్సు మెట్లపై నిల్చొని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడపోయేది ఎప్పుడు చూసిఉండరు. సిరిసిల్ల జిల్లాలో ఓ ఆర్టీసీ డైవర్ ఏకంగా స్కూల్ విద్యార్థులను బస్సు టాప్ పైన కూర్చుని ప్రయాణిస్తున్న ఓ విడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Ramya Rao Regulapati: రాబోయేది కాంగ్రెస్ పాలనే: కల్వకుంట్ల రమ్యా రావు
ఇక విషయంలోకి వెళితే.. ఈ ఘటన కేటీఆర్ ఇలాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణం నుండి టెక్స్టైల్ పార్కుకు బయలుదేరింది ఓ ఆర్డినరీ బస్సు. కాగా ఈ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సు టాప్ పైన ప్రమాదకర రీతిలో కూర్చొని ప్రయాణిస్తున్నారు. మరో వైపు ఆ బస్సు ఒక సైడ్ కి ఒరిగిపోయింది. పైగా బస్సు పై టాప్ పై స్కూల్ విధ్యార్థులు.. కానీ బస్సు డ్రైవర్, కండెక్టర్ మాత్రం అభ్యంతరం కూడా ప్రయాణం సాగించాడు. కాగా పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. అలా బస్సు టాప్ పైన ప్రయాణిస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా అభ్యంతరం తెలపని డ్రైవర్, కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణిస్తున్న బస్సును కొందరు యువకులు అడ్డగించి డ్రైవర్ తో వాగ్వదానికి దిగారు. ప్రమాదకరంగా బస్సు ప్రయాణం చేస్తున్న స్కూల్ విద్యార్థుల వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.