Kedarnath temple : రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం..

రుద్ర‌ప్ర‌యాగ్‌ (Rudraprayag) జిల్లా : రేపు ఉదయం 7.00 నిమిషాలకు పన్నెండు జ్యోతిర్లింగ ఒక్కటైన కేధార్ నాథ్ క్షేత్రం ఆల‌యాన్ని ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేధార్ నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలను పూజలు, వేద మంత్రోచ్ఛారణల మ‌ధ్య ఆలయ ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్ లింగ శివాచార్య ఓపెన్ చేయనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2024 | 12:34 PMLast Updated on: May 09, 2024 | 12:35 PM

The Kedarnath Temple Opens Tomorrow During The Popular Char Dham Yatra

రుద్ర‌ప్ర‌యాగ్‌ (Rudraprayag) జిల్లా : రేపు ఉదయం 7.00 నిమిషాలకు పన్నెండు జ్యోతిర్లింగ ఒక్కటైన కేధార్ నాథ్ క్షేత్రం ఆల‌యాన్ని ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేధార్ నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలను పూజలు, వేద మంత్రోచ్ఛారణల మ‌ధ్య ఆలయ ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్ లింగ శివాచార్య ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే భారత ఆర్మీ ఆధ్వర్యంలో సైనిక కవాతు నిర్వహిస్తు కేధార్ బాబా ఉత్స‌వ మూర్తిని విగ్రహ డోలీ.. కేదార్‌నాథ్ ఆల‌యానికి చేరుకుంది. కాగా కేధార్ నాథ్ తలుపులు తెరవడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అలంకరిస్తున్నట్లు శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ (Badrinath-Kedarnath) ఆలయ కమిటీ తెలిపింది. తీవ్ర మంచు కారణంగా ఆలయాన్ని శీతాకాలంలో మూసివేస్తారన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ఈనెల 14వ తేదీన తెర‌వ‌నున్న‌ట్లు ఛార్‌థామ్ యాత్ర అధికారులు చెప్పారు. కాగా, రానున్న వారం రోజుల పాటు కేదార్‌ఘాట్ రూట్లో వాతావ‌ర‌ణం చాలా క్లిష్టంగా ఉంటుంద‌ని ఐఎండీ తెలిపింది.

Suresh SSM