అప్పటికి వీరంతా బచ్చాలు 1988లో చివరిగా గెలిచిన కివీస్
బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు భారత్ లో కివీస్ కు ఇదే మూడో విజయం మాత్రమే. టెస్టుల్లో తొలిసారి 1969లో గెలిచిన కివీస్ ఆ తర్వాత 1988లో రెండోసారి ఇక్కడ టెస్ట్ గెలిచింది.
బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు భారత్ లో కివీస్ కు ఇదే మూడో విజయం మాత్రమే. టెస్టుల్లో తొలిసారి 1969లో గెలిచిన కివీస్ ఆ తర్వాత 1988లో రెండోసారి ఇక్కడ టెస్ట్ గెలిచింది. ఇప్పుడు 36 ఏళ్ళకు మళ్ళీ భారత గడ్డపై టెస్ట్ విజయాన్ని రుచి చూసింది. కాగా న్యూజిలాండ్ చివరిసారిగా గెలిచినప్పుడు ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడాది పిల్లాడు… కోహ్లీ అయితే 24 రోజుల పసివాడు…ఇక బూమ్రా అయితే అప్పటికి పుట్టనే లేదు. ప్రస్తుత కోచ్ గంభీర్ కూడా అప్పటికి ఏడేళ్ళ వయసు వాడే… ప్రస్తుతం బెంగళూరు టెస్టులో కివీస్ విజయం తర్వాత ఈ ఆసక్తికర విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.