Ananthapuram: అక్కడ వర్షం పడితే వజ్రాలు పండుతాయి.. అసలు సీక్రెట్‌ ఏంటంటే..

వర్షం పడితే వజ్రాలు ఏరుకునే ప్రాంతం అది. కార్మిక కర్షకులు, విద్యార్థులు నిరుద్యోగులు.. ఏజ్‌తో పనిలేదు, టైంతో సంబంధం లేదు. తొలకరి పలకరించిందంటే చాలు అంతా పొలాల్లో తిష్ట వేస్తారు. వజ్రాలు వెతకడం ప్రారంభిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2023 | 04:58 PMLast Updated on: Jun 11, 2023 | 4:58 PM

The Local People Believe That If It Rains Diamonds Will Be Found In That Area And Traders Are Also Interested In Buying Them

గతంలో చాలా మందికి అరుదైన వజ్రాలు దొరికాయి.. అయితే తాజాగా కురిసిన వర్షం రైతును కోటీశ్వరున్ని చేసింది.. అతని పొలంలో అత్యంత ఖరీదైన వజ్రం దొరికింది.. అతని దిశ మారింది..ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు రెండు జిల్లాల సరి హద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం. అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణలో ఉంటారు.. తాజాగా కురిసిన వర్షం జనాల్లో కొత్త ఊపును తెచ్చింది.. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ మనం వినేదే.

ఆ నేలల్లో వజ్రాల వేట కోసం వేరేవేరే జిల్లాల నుంచి జనం వస్తుంటారు. విలువైన రాయిలా అనిపిస్తే చాలా పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. రైతులు కూడా ఇక వ్యాపారులకు గట్టి పోటీని ఇస్తూ వజ్రాలను అన్వేషిస్తున్నారు.. అలాంటి మద్దెకర మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని 2 కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది.. ఆ విషయం అందరికి తెలియడంతో జనాలు పొలాల్లో వాలిపోయారు.. వర్షాలు పడ్డప్పుడు వెతికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకులాడుతుంటారు. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా అనే ఆశతో వెతుతుంటారు.. ఇక అనంతపూర్‌లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జనాలు అంటున్నారు.. అక్కడ కూడా వర్షం పడితే జనాలు పొలాల్లో వాలిపోతున్నారు.