మామా ఏక్ పెగ్ లా, ముగిసిన లాటరీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తయింది. 3396 మద్యం దుకాణాలకు 89 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తయింది. 3396 మద్యం దుకాణాలకు 89 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహించారు. భారీ పోలీసు భద్రత నడుమ ఈ ప్రక్రియ పూర్తి చేసారు. మహిళలు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం.
ఇక దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. దరఖాస్తుల ద్వారా 1800 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ నెల 16 నుండి 26 జిల్లాల్లో 3396 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. చిప్ లిక్కర్ క్వార్టర్ 99 కే… ప్రీమియం లిక్కర్ అందుబాటులోకి వస్తోంది. లైసెన్స్ ఫీజు ద్వారా 2 వేల కోట్లు….కొనుగోళ్ళ ద్వారా మరో 300 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.