Sanju Samson: పొమ్మనక పొగపెట్టడం పాపం సంజూ
సంజూ శాంసన్ ను టీం నుంచి బయటకు పంపించిన యాజమాన్యం.

The management sent Sanju Samson out of Team India without giving him a chance to play
ఆసియా కప్ లో భాగంగా రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు శాంసన్ ని తాజాగా భారత మేనేజ్ మెంట్ విడుదల చేసింది. టోర్నీ సూపర్ 4 దశకు ముందు కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్‌కు బ్యాకప్‌గా శాంసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాయం కారణంగా లీగ్ లో తొలి రెండు మ్యాచులు ఆడలేదు. కానీ ప్రస్తుతం రాహుల్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో శాంసన్ అవసరం ఇక లేదని భావించి స్వదేశానికి పంపించేశారు. అసలే రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేసి శాంసన్ కి తీవ్ర అన్యాయం చేయడంతో పాటు తాజాగా జట్టులో నుంచి విడుదల చేసి పెద్ద షాక్ ఇచ్చింది యాజమాన్యం. దీంతో ప్రస్తుతం సంజు శ్రీలంక నుండి స్వదేశానికి కాకుండా అటు నుంచి దుబాయ్ కి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల క్రితం ఈ కేరళ బ్యాటర్ వేరే దేశం తరపున ఆడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తనకి దేశం కంటే ఏది ముఖ్యం కాదని తేల్చేసాడు. టాలెంట్ ఉన్నా.. జట్టులో ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోతన్న శాంసన్ నిజంగా దురదృష్టవంతుడే అని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతూ ఉన్నారు.