కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం.. ఏం రాశారో తెలుసా..?

‘‘కరప్ట్ వర్కింగ్ కమిటీ” అని ఆ పోస్టర్లపై రాతలు. పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలను ప్రచురించారు. వారు కొన్ని స్కామ్ లు చేశారనే ఆరోపణలను కూడా ఆ పోస్టర్లపై ముద్రించడం గమనార్హం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 10:51 AMLast Updated on: Sep 16, 2023 | 10:51 AM

The Meetings Of The Congress Working Committee Cwc Will Begin Shortly At The Taj Krishna Hotel In Hyderabad Corrupt Working Committee Written On Those Posters

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం.. ఏం రాశారో తెలుసా ?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌ తాజ్ కృష్ణ హోటల్ లో ప్రారంభం కానున్నాయి. ఈ మీటింగ్స్ లో సోనియాగాంధీ సహా కీలక కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు హైదరాబాద్ సిటీ లోని కొన్ని ప్రాంతాల్లో వెలిశాయి.

‘‘కరప్ట్ వర్కింగ్ కమిటీ” అని ఆ పోస్టర్లపై రాతలు. పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలను ప్రచురించారు. వారు కొన్ని స్కామ్ లు చేశారనే ఆరోపణలను కూడా ఆ పోస్టర్లపై ముద్రించడం గమనార్హం. సిటీ లో వెలసిన ఈ పోస్టర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ ను ధైర్యంగా ఎదుర్కోలేని పిరికి పందలు.. దొంగచాటుగా ఈ పోస్టర్లను అంటించారు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోస్టర్ లో ఉన్న కాంగ్రెస్ నేతల పేర్లు, ప్రస్తావించిన స్కాముల వివరాలివీ..

 

  • మల్లికార్జున ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కాం
  •  సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం
  •  మన్మోహన్ సింగ్ – కోల్ అలోకేషన్ స్కాం
  •  రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
  •  ఏకే ఆంటోనీ – నేషనల్ హెరాల్డ్ స్కాం
  • మీరా కుమార్ – నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం
  • దిగ్విజయ్ సింగ్ – రిక్రూట్ మెంట్ స్కాం
  •  చిదంబరం – ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కాం
  •  లాల్ థన్ వాలా –మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం
  • ముఖుల్ వాస్నిక్ – ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం 
  • ఆనంద్ శర్మ – వాల్ మార్ట్ స్కాం
  • అశోక్ రావ్ చవాన్ – ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం
  •  చరంజిత్ సింగ్ చన్నీ – స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం
  • ప్రియాంక గాంధీ వాద్రా – నేషనల్ హెరాల్గ్ స్కాం,డీఎల్ఎఫ్ లాండ్ స్కాం,
  •  అభిషేక్ మనుసింఘ్వీ – సీడీ రికార్డింగ్ స్కాం
  • జైరాం రమేష్ – కోల్ స్కాం
  • మహేంద్రజీత్ సింగ్ మాల్వియా –అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం
  • కేసీ వేణుగోపాల్ – సోలార్ స్కాం
  • అధిర్ రంజన్ చౌదరి – శారదా స్కాం
  •  అంబికా సోని – రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం
  • అజయ్ మాకెన్ – రియల్ ఎస్టేట్ స్కాం
  • తామ్రద్వజ్ సాహు – ఆవు పేడ స్కాం
  •  సల్మాన్ ఖుర్షీద్ – వీల్ చెయిర్ స్కాం
  • శశిథరూర్ – స్పాట్ ఫిక్సింగ్ స్కాం