Rain Alert: మరో రెండు రోజులు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అప్‌డేట్
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనిప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే చాన్స్ ఉంది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే చాన్స్ ఉంది.