Human Lips Plant : ప్రపంచంలోనే అత్యంత అందమైన.. మానవ పెదాలు పోలిన మొక్కను చూశారా..?
ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు.. వింతలు.. విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ వింతలు మానవుల ముందు తారస పడుతాయి. ఇలాంటి అద్భుతమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యం కు కు.. ఆకర్షణకు గురి చేసింది. అదేంటో మీరే చూడండి.

మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్,

దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి.

ఈ మొక్కను సైకోట్రియా ఎలాటా లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్‌గా పిలుస్తారు.

ఈ హాట్ లిప్స్ ప్లాంట్ ఈ భూమ్మీద ఉండే వృక్షజాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొన్నారు.

దీన్ని బొటానికల్ వండర్‌గా పిలుస్తారు.

ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లా కనిపిస్తాయి.

ఇవి హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది.

పువ్వులు పూసే ముందే ఇలా పెదవుల ఆకారంలో ఈ మొక్క కనిపిస్తుందట.

దీని లోపలి నుంచి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు పుష్పిస్తాయి.

ఇవి సాదారణంగా అంతగా అట్రాక్టివ్‌గా కనిపించవు.

సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు డిసెంబర్, మార్చి నెలల్లో పుష్పిస్తాయి.

మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట.

ఎక్కువగా వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట.

దీని బెరడు, ఆకులను స్థానికులు చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

ఈ మొక్క ప్రస్తుతం కనుమరుగైపోతున్న జాబితాలో ఉందట.

వాతావరణ మార్పులే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.