తెలుగు టీవీ షోల (Telugu Tea Show) లో.. బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. కొందరు తిడతారు.. మరికొందరు పొగుడుతారు.. ఇంకొందరు అవసరమా అంటారు.. ఐతే అందరు కలిసి మాత్రం చూస్తారు.. అదే బిగ్‌బాస్ మ్యాజిక్. ఒకటి, రెండు సీజన్లు మినహాయిస్తే.. తెలుగులో బిగ్‌బాస్ (Bigg Boss) అన్ని ఎడిషన్లు దాదాపు సక్సెస్. కొత్త కొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్, కాంట్రవర్సీస్, వినోదాలతో సాగుతూ.. అందరినీ టీవీలకు కట్టిపడేస్తుంటుంది బిగ్‌బాస్. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కాబోతోంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో (Game show) తర్వాతి సీజన్‌ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. 8వ సీజన్‌కు సంబంధించి లోగోను రిలీజ్ చేసిన నిర్వాహకులు.. లేటెస్ట్‌గా టీజర్ వదిలారు. కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో... నాగార్జున (Nagarjuna) వరాలు అందించే జీనీ పాత్రలో కనిపించారు. ఈసారి మరింత ఎంటర్‌టైన్ (Entertain) అవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుండగా.. ఒక్కసారి కమిట్ ఐతే లిమిటే లేదు అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎవ్రీ సీజన్‌కు టాస్క్‌లు, ఎంట్రీల విషయంలో కొత్తదనం చూపించే నిర్వాహకులు.. ఈసారి అంతకుమించి అనేలా ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కావాల్సినన్ని సర్‌ప్రైజ్‌లు రెడీ చేసినట్లు టాక్. సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున కనిపించబోతున్నారు. ఐతే సీజన్ 8 డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 (Bigg Boss 8) స్టార్ట్ అయ్యే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీజన్ 8 స్టార్ట్ కాకముందే.. హౌస్ లోపలికి వెళ్లేది వీళ్లే అటూ ప్రచార ఊపందుకుంది. విష్ణుప్రియ, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్.. బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్స్‌గా ఎంపికైట్లు తెలుస్తోంది. వేణు స్వామి, క్రికెటర్ అంబటి రాయుడు, నటుడు రోహిత్‌తో పాటు కుమారి ఆంటీ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ఒకటే గుసగుస. మరి ఏది నిజం అన్నది తేలాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.