BRS CHANGE TO TRS : BRS పేరు అచ్చురాలేదు ! TRS మార్చాలని కేసీఆర్ డిసైడ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓడాక మాజీ సీఎం కేసీఆర్ (KCR) కి తన తప్పులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పేరు తనకు అచ్చిరాలేదని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం... లీడర్లు జైళ్ళకు వెళ్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓడాక మాజీ సీఎం కేసీఆర్ (KCR) కి తన తప్పులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పేరు తనకు అచ్చిరాలేదని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం… లీడర్లు జైళ్ళకు వెళ్తున్నారు. తెలంగాణ అనే పదాన్ని పార్టీని తీసేయడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయి. మళ్ళీ వెనక్కి వెళితేనే బెటర్… BRS పేరు మార్చుకోవాల్సిందే … మళ్ళా TRS పెట్టుకోవాల్సిందే… అనుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్.
తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) పేరు మార్చేయడం బాగానే దెబ్బకొట్టిందని భావిస్తున్నారు కేసీఆర్. కేంద్రంలో మోడీని పీకేయాలి… అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలి… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారు. అందుకే TRS ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దాంతో అసలు తెలంగాణలో పార్టీ ఓడిపోయి పునాదులు కదిలిపోయాయి. పార్టీ పేరు మార్పు ఎంత పెద్ద తప్పో ఇప్పటికి తెలిసొచ్చింది కేసీఆర్ కి. అందుకే మళ్ళీ BRS ను TRS గా మార్చాలని డిసైడ్ అయ్యారు.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ… TRSను అనవసరంగా పేరు మార్చామని గులాబీ బాస్ కేసీఆర్ కి ఇప్పటికి అర్థమైంది. కిందటేడాది TRSను BRSగా మార్చిన తర్వాత.. అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనుకున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లో నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. మహారాష్ట్రకు అయితే తెలంగాణ ప్రజల సొమ్ముతో భారీ కాన్వాయ్ వేసుకొని వెళ్ళొచ్చారు. జాతీయ రాజకీయాలను (National Politics) దృష్టిలో పెట్టుకొనే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు KCR. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి పేరు మార్పే ప్రధాన కారణమని TRS నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయంపై KCR ను కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు టార్గెట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక జరిగిన సమీక్ష సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని KCR దృష్టికి తీసుకెళ్ళారు ఆ పార్టీ నాయకులు.
భారత రాష్ట్ర సమితిని మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చి… తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల సంఘం ఆమోదిస్తే త్వరలోనే BRS ఇక TRS గా మారబోతోంది.