New Corona : కొత్త కరోనా JN1 అంత డేంజర్ కాదు!కానీ వాళ్ళు మాత్రం జాగ్రత్త !

దేశమంతటా కొత్త కరోనా వేరియంట్ JN1 విస్తరిస్తోంది. దేశంలో మొత్తం 3వేల దాకా కేసులు నమోదయ్యాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ వేరియంట్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే JN1 అంత ప్రమాదం కాదనీ.. కానీ ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది గుమికూడే చోట మాస్క్ పెట్టుకోవాలనీ.. డయాబెటీస్, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 11:52 AMLast Updated on: Dec 23, 2023 | 11:52 AM

The New Corona Is Not As Dangerous As Jn1 But They Are Careful

దేశమంతటా కొత్త కరోనా వేరియంట్ JN1 విస్తరిస్తోంది. దేశంలో మొత్తం 3వేల దాకా కేసులు నమోదయ్యాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ వేరియంట్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే JN1 అంత ప్రమాదం కాదనీ.. కానీ ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది గుమికూడే చోట మాస్క్ పెట్టుకోవాలనీ.. డయాబెటీస్, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం భారత్ లో ప్రభావం చూపిస్తున్న కొత్త కరోనా JN1 అంతకు ముందు వచ్చిన ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్. అప్పట్లో ఒమిక్రాన్ ఎక్కువ మందికి సోకినట్టే.. ఇది కూడా దాదాపు అలాంటి ప్రభావమే చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉండటం గానీ, ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉండదని భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. సాధారణ జలుబు, సైనసైటిస్, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలు మాత్రమే రోగుల్లో కనిపిస్తున్నాయి. అందరూ అన్ని చోట్లా మాస్కులు పెట్టుకోనవసరం లేదంటున్నారు డాక్టర్లు. కానీ డయాబెటీస్, క్యాన్సర్.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి.

మన దేశంలో కేరళలో ఎక్కువగా JN1 కేసులు నమోదవుతున్నాయి. అలాగే సింగపూర్ లో, యూఎస్, యూరప్ కంట్రీస్ లో కూడా ఈ కరోనా వేరియంట్ ప్రభావం కనిపిస్తోంది. ఒమిక్రాన్ తో పోలిస్తే ఈ వైరస్ కి విస్తరించే సామర్థ్యం తక్కువేనని WHO చెబుతోంది. ఈ వైరస్ ను ఎదుర్కోడానికి ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. అమెరికాలో 65యేళ్ళు దాటినవారు బూస్టర్ డోస్ వేసుకోవాలని అక్కడి డాక్టర్లు సూచిస్తున్నారు. మన దేశంలో చాలామందికి కరోనా సోకి ఉండటంతో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. ఒకవేళ JN1 వైరస్ సోకినా అది తీవ్రంగా మారకుండా ఈ ఇమ్యూనిటీ కాపాడుతుందని అంటున్నారు వైద్యనిపుణులు. ఇమ్యూనిటీని దెబ్బతీస్తే మాత్రం.. జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గర గర, దగ్గు, తలనొప్పి లాంటి స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. విదేశీ పర్యటనలు చేసిన వచ్చినవారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు.