i Phone15: దుమ్ము రేపే ఫీచర్స్ తో సరికొత్త ఐఫోన్ మోడల్స్.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

యాపిల్ కంపెనీ ఎట్టకేలకు ఐఫోన్ 15 మోడల్స్ పూర్తి వివరాలతో పాటూ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే తేదీని ప్రకటించింది. వీటి ధరను కూడా వెల్లడించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2023 | 08:13 AMLast Updated on: Sep 13, 2023 | 8:13 AM

The New Iphone 15 Model With Amazing Features Will Be Available Soon

సెల్ ఫోన్లలో రారాజు యాపిల్ వండర్ లస్ట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తన సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. అందులో ఐఫోన్ 15 తోపాటూ యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈవెంట్ వేదికగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఉత్పత్తులు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఇది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా నిలిచింది. 2030 నాటికి తమ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పర్యావరణహితంగానే ఉంటాయని తెలిపారు. అలాగే ఈ ఐఫోన్స్ కి తొలిసారిగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో  తీసుకురానున్నారు. ఈ టెక్ దిగ్గజ సంస్థ విడుదల చేసిన ప్రోడక్ట్స్ సెప్టెంబరు 22 నుంచి ఆన్లైన్, ఈకామర్స్, ఆఫ్లైన్ స్టోర్స్ లో లభిస్తాయని చెప్పారు. అయితే వీటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 15

  • 48 మెగాపిక్సెల్ కెమెరా
  • 6.1 అంగుళాల స్క్రీన్
  • 128 జీబీ స్టోరేజ్
  • ఏ16 బయోచిప్
  • ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ ప్లే
  • డైనమిక్ ఐలాండ్
  • గులాబీ, పసులు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో లభ్యం
  • ధర 799 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 66వేలకు పైమాటే

ఐఫోన్ 15 ప్లస్

  • 48 మెగాపిక్సెల్ కెమెరా
  • 6.7 అంగుళాల స్క్రీన్
  • 128 జీబీ స్టోరేజ్
  • ఏ16 బయోచిప్
  • ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ ప్లే
  • డైనమిక్ ఐలాండ్
  • గులాబీ, పసులు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో లభ్యం
  • ధర 899 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 74వేలకు పైమాటే

ఐఫోన్ 15 ప్రో

  • 48 మెగాపిక్సెల్ కెమెరా
  • 6.1 అంగుళాల స్క్రీన్
  • 128 జీబీ స్టోరేజ్
  • ఏ17ప్రో చిప్
  • సూపర్ రెటీనా ఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే
  • టైటానియమ్ డిజైన్
  • 100 శాతం రీ సైకిల్డ్ మొటీరియల్
  • పల్చటి బోర్డుతో బరువు తక్కువ
  • ధర 999 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 82వేలకు పైమాటే

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్

  • 48 మెగాపిక్సెల్ కెమెరా
  • 6.7 అంగుళాల స్క్రీన్
  • 128 జీబీ స్టోరేజ్
  • ఏ17 ప్రో చిప్
  • సూపర్ రెటీనా ఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే
  • టైటానియమ్ డిజైన్
  • 100 శాతం రీ సైకిల్డ్ మొటీరియల్
  • పల్చటి బోర్డుతో బరువు తక్కువ
  • ధర 1199 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 99వేలకు పైమాటే
Apple Smart Watch Series 9

Apple Smart Watch

వాచ్ సిరీస్ 9

  • 9 ఎస్ చిప్ అమర్చారు
  • అత్యంత వేగంగా పనిచేసే సామర్థ్యం
  • ఐఫోన్ ట్రేస్ చేయగల సామర్థ్యం
  • డబుల్ ట్యాప్ తో ఫోన్ కాల్ రిసీవింగ్ / డిస్ కనెక్ట్ చేయవచ్చు
  • స్టాండర్డ్ కర్బన మూలకాలతో తయారు చేశారు
  • సాధారణ వాచ్ ధర 399 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 33 వేల వరకూ ఉంటుంది
  • జీపీఎస్ ఫీచర్ వాచ్ ధర 499 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 40 వేల వరకూ ఉంటుంది

వాచ్ అల్ట్రా 2

  • 9 ఎస్ చిప్ అమర్చారు
  • కాల్స్ కోసం డబుల్ ట్యాప్ ఫీచర్
  • ఐఫోన్ ట్రేసింగ్ ఆప్షన్
  • 95 శాతం రీ సైకిల్డ్ మెటీరియల్
  • లో పవర్ మోడ్ లో 72 గంటల బ్యాటరీ నిలువ ఉండే ప్రత్యేక సామర్థ్యం
  • దీని ధర 799 డాలర్లు.. మన కరెన్సీ ప్రకారం 66 వేలు ఉంటుంది
  • ఇది ప్రారంభ ధర మాత్రమే

T.V.SRIKAR