Gold, Silver : పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. అవును బంగారం(Gold)వార్త మరి.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌ (Bullion Market)లో బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. దీంతో బంగారంతో పాటు వెండి (Silver) ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం 10గ్రాముల పసిడి 22 క్యారెరట్లు (22 Carat Gold) ధర రూ.210 దిగొచ్చి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 09:04 AMLast Updated on: Feb 07, 2024 | 9:04 AM

The News Is Like Gold For Pasidi Lovers The Prices Of Gold And Silver Have Fallen Again

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. అవును బంగారం(Gold)వార్త మరి.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌ (Bullion Market)లో బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. దీంతో బంగారంతో పాటు వెండి (Silver) ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం 10గ్రాముల పసిడి 22 క్యారెరట్లు (22 Carat Gold) ధర రూ.210 దిగొచ్చి.. రూ.57,740 వద్ద స్థిరంగ ఉంది. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 221 తగ్గి.. రూ.62,990 వద్ద స్థిరంగ ఉంది. ఇక కేజీ వెండి రూ.1000 దిగొచ్చి.. రూ.74,300కి చేరింది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,990గా నమోదైంది. హైదరాబాద్‌లో, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరల్లో మార్పేమీ లేదు.

  • చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,590గా ఉంది.
  • ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,740గాను… 24 క్యారెట్ల పసిడి రూ.62,990గాను ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,140గా ఉంది.
  • కలకత్తా ప్రస్తుతం C 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,990గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీ వెండి రూ.1000 దిగొచ్చి.. రూ. 74,300 వద్ద స్థిరంగా ఉంది.

  • హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది.
  • విశాఖ కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది.
  • విజయవాడల్లో కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది.
  • బెంగళూరులో రూ. 71,500గా ఉంది.
  • వెండి ధరలు కోల్కతాలో రూ. 74,200..
  • ఢిల్లీలో కూడా కేజీ వెండి ధర. 75,700 పలుకుతోంది.

మిగిలిన ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. రేపు బులియన్ మార్కెట్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయో వేచి చూడాలి.