Pakistan Cricket Team : బిర్యానీ కోసం ఎప్పుడు తెల్లారుతుందా అని.. ఎదురుచూపులు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ 'పెషావర్ రెస్టారెంట్'లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు.

The Pakistan cricket team which has come to Hyderabad for the ICC ODI World Cup 2023 is enjoying the flavors of Bhagyanagara whenever possible during the breaks of the matches
Pakistan Cricket Team ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ ‘పెషావర్ రెస్టారెంట్’లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ‘పెషావర్ హోటల్’ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు ఆ రెస్టారెంట్ సిబ్బంది. బాబర్ అజామ్, ఇమామ్-ఉల్-హక్ మినహా.. మిగిలిన పాక్ క్రికెట్ ప్లేయర్స్.. మన హైదరాబాద్ బిర్యానీ రుచిని.. వారి స్వస్థలమైన ‘కరాచీ బిర్యానీ’ తో పోల్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల ‘జువెల్ ఆఫ్ నిజాం’లో పాక్ క్రికెట్ టీమ్.. హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదొవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. పెయింటింగ్‌ను మెచ్చుకోవడం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నేటికీ హల్చల్ చేస్తుంది. పాకిస్తాన్ తన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక తమ తదుపరి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడబోతుంది పాకిస్థాన్ జట్టు.