పోలీసులే దొంగలా! ట్రైనీ డాక్టర్ కేసులో సంచలనం
విచారణ సాగుతున్నకొద్దీ ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ విచారణలో తీగ లాగినకొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతోంది. సీబీఐ అదుపులో ఉన్న సందీప్ ఘోష్ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి.
విచారణ సాగుతున్నకొద్దీ ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ విచారణలో తీగ లాగినకొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతోంది. సీబీఐ అదుపులో ఉన్న సందీప్ ఘోష్ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి. ఈ కేసులో ఎవరి హస్తం లేదని సంజయ్ రాయ్ మాత్రమే ఈ నేరం చేశాడని నిన్నటిదాకా అంతా అనుకున్నారు. కానీ విచారణ సాగుతున్నకొద్దీ ఒక్కొక్కరుగా నిందితులు బయటికి వస్తున్నారు. క్రైం జరిగిన తరువాత చాలా సేపు ఎవరినీ ఆ క్రైం సీన్‌లోకి రానివ్వలేదు. ఈ గ్యాప్‌లో అక్కడ ఆధారాలు ట్యాంపర్ చేశారని చాలా మంది ముందునుంచీ ఆరోపిస్తున్నారు.
కానీ ఈ విషయంలో పోలీసులు గతంలో క్లారిటీ ఇచ్చారు. క్రైం సీన్‌లోకి మొదట ఎంటర్ అయ్యింది పోలీసులేనని.. అక్కడ ఉన్నవాళ్లంతా డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తులేనని.. కాబట్టి ఆధారాలు ట్యాంపర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదని చెప్పారు. కానీ.. కొన్ని కీలక ఆధారాలను పోలీసులే ట్యాంపర్ చేశారని ఇప్పుడు సీబీఐ చేసిన ఆరోపణ దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని మరోసారి హాట్ టాపిక్‌గా మార్చేసింది. సీబీఐ అదుపులో ఉన్న ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ విషయాన్ని విచారణలో చెప్పాడని సీబీఐ చెప్తోంది. దానికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టుకు అందించగా దీంతో సీబీఐ వాదనను పూర్తిగా సమర్పించింది కోర్టు.
ఈ విషయంలో మరింత డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలని సీబీఐని ఆదేశించింది. క్రైం సీన్‌కు ఎవరూ రాలేదు కాబట్టి ఆధారాలు ట్యాంపర్ కాలేదని అంతా అనుకున్నారు. కానీ వచ్చిన పోలీసులే సంజయ్‌ని కాపాడేందుకు ఆధారాలు ట్యాంపర్ చేశారు అంటే.. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ఏ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బయటికి రావడంతో సీబీఐ ఇప్పుడు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడింది. పోలీసుల్లో ఎవరెవరు సంజయ్ రాయ్‌కి సాయం చేసేందుకు ప్రయత్నించారో లిస్ట్ రెడీ చేసి వాళ్లను కూడా అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.