gas cylinder : దేశ వ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతో తెలుసా..?

తాజాగా నిన్న దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇలా ఎన్నకలు ముగిసాయే లేదో.. అలా దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 11:59 AMLast Updated on: Dec 01, 2023 | 11:59 AM

The Price Of 19 Kg Commercial Gas Cylinder Has Increased Across The Country

తాజాగా నిన్న దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇలా ఎన్నకలు ముగిసాయే లేదో.. అలా దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి.

Telangana Politics : చక్రం తిప్పుతున్న డీకే.. కర్నాటకకు తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థులు ..!?

నేటి నుంచి అనగా.. డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. ఇవాళ నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది.

నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50,
చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్‌ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది.

కాగా 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ రాఖీ పండుగు సందర్భంగా.. ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది.