బంగారం కొనాలి అనుకునేవాళ్లకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. కేవలం ఆభరణాల రూపంగానే కాదు. పెట్టుబడి పెట్టేందుకు కూడా చాలా మంది బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రతీ ఇంట్లో కొంతైనా బంగారం ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్లందరికీ మంచి రోజులు వచ్చాయి. క్రమంగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఇప్పుడు మరింత తగ్గింది. తులం రేటు ఏకంగా వెయ్యి రూపాయలకుపైగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2401 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 29.23 డాలర్ల వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు మూడు రోజుల్లో దాదాపు వెయ్యి రూపాయల మేర పడిపోయింది. ఇవాళ ఒక్క రోజే తులం రేటు 380 రూపాయలు తగ్గి 73 వేల 970 వద్దకు దిగివ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 350 రూపాయల మేర తగ్గి తులానికి 67 వేల 8 వందలకు పడిపోయింది. ఢిల్లీలో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి 380 తగ్గి 74 వేల 120 పలుకుతోంది. 22 క్యారెట్లకు బంగారానికి ధర 350 తగ్గి 67 వేల 950 వద్దకు దిగివచ్చింది. బంగారం దారిలోనే నడుస్తూ వెండి కూడా భారీగా పడిపోతోంది. గత మూడు రోజుల్లో కిలో వెండి రేటు ఏకంగా 4 వేల 500 మేర దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1750 రూపాయలు తగ్గి 96 వేల వద్దకు దిగివచ్చింది. ఢిల్లీలో కిలో వెండి రేటు 91 వేల 500 పలుకుతోంది. బంగారం కొనాలి అనుకునేవాళ్లకు నిజంగా ఇది చాలా మంచి సమయం అంటున్నారు మార్కెట్ నిపుణులు.