Miyazaki Mango : ఈ మామిడి పండ్ల ధర రూ.2 లక్షలా..?

మామిడి ఈ పండు గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. అదే భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. పండు.. అందులోను మన దేశపు జాతీయ పండు కూడా ఈ మామిడి పండే. నిజానికి మనకు వేసవి అంటే ఎండల కన్న ముందుగా.. మామిడి పండే గుర్తుకు వస్తుంది. అందులోను పండ్లకు ఇది రారాజు గా పిలుస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2024 | 10:31 AMLast Updated on: Apr 29, 2024 | 10:31 AM

The Price Of These Mangoes Is Rs 2 Lakh

మామిడి ఈ పండు గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. అదే భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. పండు.. అందులోను మన దేశపు జాతీయ పండు కూడా ఈ మామిడి పండే. నిజానికి మనకు వేసవి అంటే ఎండల కన్న ముందుగా.. మామిడి పండే గుర్తుకు వస్తుంది. అందులోను పండ్లకు ఇది రారాజు గా పిలుస్తారు.

భారత దేశంలో సర్వ సాధారణంగా అన్ని ప్రదేశాల్లో ఈ మామిడి పండు పండుతుంది. ఎడారి.. హిమాలయాల్లో తప్ప అన్ని ప్రదేశాల్లో పండుతుంది. కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా పండుతుంది. తోట మామిడి, బంగినపల్లి, కలెక్టర్ మామిడి, నీలవేణి, రసాలు, చెరకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణ మామిడి, అరటి మామిడి, కొబ్బరి మామిడి ఇలా దేశంలో చాలా రకాలుగానే ఉన్నాయి. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రేటు ఉంటుంది. గానీ ఎప్పుడైనా అనుకున్నారా ఒక పండు వేల్లో గానీ.. కేజీ లక్షల్లో గానీ ఉంటుందని.. అయితే ఇది మీకోసమే.. నిజానికి ఈ పండు తినాలంటే అదృష్టం ఉండాలి అని అంటారు. అందులోను ఆ పండు మన దేశంలో అయితే అసలు పండదు.. ఆ పండు పండేది జపాన్ దేశంలో..

ఇక విషయంలోకి వెళితే…
జపాన్ దేశంలో ఒక రకమైన జాతికి చెందిన పండు పండుతుంది. దాని పేరు మియాజాకి మామిడి అని అంటారు. చూడ చక్కని ఊదా రంగులో ఉండే ఈ మామిడి పండుకు డిమాండ్ అంతా ఇంతా కాదండోయ్… వీటి ధర వందల రూపాయలు కాదు.. కదా వేలు రూపాయలకు కూడా కాదు ఏకంగా లక్షల ధర పలుకుతోంది..! వీటి ఖరీదుతో మన ఒక కొత్త షోరూం బైక్ కొనేయవచ్చు. అంటే అర్థం కాలేదా.. అవునండి అక్షారాల ఈ పండ్ల కేజీ ఖరీదు మన నిత్యం నడుపుకునే బైక్ అంతు అంటే రెండు లక్షలు అన్న మాటా.

  • ఈ మామిడి పండ్ల ధర రూ.2 లక్షలా..?

జపాన్లో పెరిగే మియాజాకి మామిడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో ఏ మామిడికి లేనంత ధర ఈ మామిడికి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కిలో మియాజాకి మామిడి ధర రూ. 2 లక్షలకు పైమాటే. దీని రంగు ఎరుపుగా, బర్గంటిలో ఉంటుంది. పెద్ద సైజ్ , వాసన, స్వీట్నెస్కు ప్రసిద్ధి చెందాయి.

మియాజాకి నగరంలో 1970-1980ల మధ్య మామిడి పండించడం ప్రారంభించారు. జపాన్‌లోని మియాజాకి నగరంలో పండిస్తారు. అందుకే దానికి ఈ పేరు వచ్చింది. ఇది దేశంలో పండించే అత్యంత ప్రసిద్ధ పండ్లలో ఒకటి.. ఈ పండు 350g కంటే ఎక్కువ బరువు ఉంటుంది. 15% లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది. అత్యంత నాణ్యమైన మియాజాకి మామిడి పండ్లను ‘తైయో-నో-టొమాగో’ (జపాన్ భాష) లేదా ‘సూర్యరశ్మి గుడ్లు’గా అని అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు ఊదా రండులో ఉండే ఈ మామిడి పండు పండినప్పుడు ఎర్ర రంగులోకి మారతాయి.

  • ఈ దేశాల్లో మియాజాకి పండ్ల సాగు..

ఇది ప్రపంచంలో అత్యంత ప్రీమియం పండ్లలో ఒకటి. జపాన్‌లో విక్రయించే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్ లో కిలో మామిడి ధర రూ. 2.70 లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డ్ సృష్టించిన ఈ అరుదైన మామిడి పండ్లు భారతదేశం,బంగ్లాదేశ్‌, థాయిలాండ్ , ఫిలిప్పీన్స్‌లో కూడా పండిస్తున్నారు.

  • భారతదేశంలో మియాజాకి పండ్ల సాగు..

భారత దేశంలో ఈ రకమైన పండ్లను మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జబల్‌పూర్‌లోని తమ పొలంలో మియాజాకి మామిడి రకాన్ని పండించారు. ఈ అరుదైన మామిడి పండ్లను దొంగిలించకుండా కాపాడేందుకు నలుగురు గార్డులను, ఏడు కుక్కలను నియమించుకోవాల్సి వచ్చింది. ఆ రైతు..

SSM