Trains Cancel: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ
విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్ళే ఎక్స్ ప్రెస్ సహా పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేశారు రైల్వే ఉన్నతాధికారులు.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరం. ఇందులో తప్పెవరిదైనా జరిగిన ఘటన మాత్రం చాలా మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎటు చూసినా చల్లాచెదురుగా పడిపోయిన శరీరాలే కనిపిస్తున్నాయి. చాలా మంది క్షతగాత్రలు ప్రమాదాన్ని తలుచుకుని ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని సోమవారం దారి మళ్లించారు. ట్రాక్ క్లియర్ చేసిన తరువాతే పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా నేడు సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ఈస్ట్ కోస్ట్ జోన్ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నేడు రద్దైన రైళ్ల వివరాలు..
- హౌరా- సికింద్రాబాద్ (12703) ఫలక్నుమా ఎక్స్ ప్రెస్
- హౌరా – బెంగళూరు (12245) దూరంతో ఎక్స్ ప్రెస్
- షాలిమార్ – హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్
- విశాఖ – గుణుపుర్
- విశాఖ – రాయగడ
- విశాఖ – పలాస
ఈ రద్దైన ఆరింటిలో మూడు ఎక్స్ ప్రెస్, మూడు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.