Inter results : నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నట్లు సోమవారం(జూన్ 24) విడుదల కానున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది.

The results of the Inter Advanced Supplementary Examination will be declared today at 2 pm in Telangana
తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నట్లు సోమవారం(జూన్ 24) విడుదల కానున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది. ఫలితాలు విడుదలైన కాసేపటికి విద్యార్థులు ఈ వెబ్ సైట్లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. ఫలితాల కోసం ఈ వెబ్ సైట్లు క్లిక్ చేయండి. http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in
గత నెల 24 నుంచి ఈనె 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మే, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన వారితో పాటు ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు.