TSPSC : ఆ మార్పులు చేస్తే TSPSC కి తిరుగులేదు !
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సమూలంగా మార్పులు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా IAS అధికారులు ఇతర రాష్ట్రాల PSCలు, UPSC ని స్టడీ చేస్తున్నారు. జాబ్ కేలండర్, ఖాళీ పోస్టుల గుర్తింపు లాంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఈ స్టడీ పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే TSPSC ని ఓ దారికి తీసుకురానుంది ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సమూలంగా మార్పులు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా IAS అధికారులు ఇతర రాష్ట్రాల PSCలు, UPSC ని స్టడీ చేస్తున్నారు. జాబ్ కేలండర్, ఖాళీ పోస్టుల గుర్తింపు లాంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఈ స్టడీ పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే TSPSC ని ఓ దారికి తీసుకురానుంది ప్రభుత్వం.
పేపర్ లీక్స్.. తరుచుగా వాయిదాలు.. పేపర్లలో తప్పులు దొర్లడం.. కోర్టుల్లో కేసులు.. TSPSC లో ప్రతి యేటా రిపీట్ అయ్యే ఇలాంటి సవాలక్ష తప్పులకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రూప్ 1, ఇతర పేపర్ల లీకేజీలతో TSPSC పరువు గోదాట్లో కలిసింది. అందుకే ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా.. పారదర్శకంగా కమిషన్ నడిచేలా చర్యలు తీసుకోబోతున్నారు. అందుకోసం TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్.. కేరళకు వెళ్ళి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించి వచ్చారు. ఈనెల 5న ఇద్దరు IAS అధికారులు వాణీ ప్రసాద్, నదీం ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ UPSC లో పోస్టుల భర్తీ విధానం ఎలా కొనసాగుతుందో స్టడీ చేస్తారు. ఈ IAS అధికారులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా TSPSC ప్రక్షాళన జరగబోతోంది.
ఇక నుంచి ప్రభుత్వంలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటిప్పుడు భర్తీ చేసే విధానం రాబోతోంది. జాబ్ కేలండర్ ఇస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చూస్తోంది. కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పర్ ఫెక్ట్ గా ఉంటుంది. అక్కడ ఏ డిపార్ట్ మెంట్ లో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్డ్ అవుతారో ముందుగానే గుర్తిస్తారు. ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే.. కొత్తవారు వచ్చి జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం వల్ల.. పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే పోటీపడే అభ్యర్థుల సంఖ్య కూడా తగ్గుతుంది. పరీక్షల నిర్వహణ ఈజీ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఛాన్సుంది. కేరళ విధానం ఫాలో అవ్వాలి అంటే… రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీస్ ని ఆరు నెలల ముందే గుర్తించాలి.
ఇక UPSC నియామకాలైతే తిరుగు లేదు. ప్రతి యేటా కొత్త సంవత్సరం రాక ముందే జాబ్ కేలండర్ ఇస్తుంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఎగ్జామ్స్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగవు. పైగా ఎగ్జామ్స్ వాయిదా పడటం, కోర్టుకు వెళ్ళడం లాంటి వివాదాలు తలెత్తవు. అందుకే UPSC ప్యాటర్న్ కూడా IAS అధికారులు స్టడీ చేస్తున్నారు. ఈ రెండు నివేదికల ఆధారంగా TSPSCని ప్రక్షాళన చేస్తారు. ఈలోగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న TSPSC ఛైర్మన్, సభ్యుల రాజీనామాల ఇష్యూ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. న్యూఇయర్ విషెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అంశాన్ని గవర్నర్ తమిళిసై దృష్టికి తెచ్చారు. అది క్లియర్ అయితే.. వెంటనే TSPSC కి ఛైర్మన్, ఇతర సభ్యులను రేవంత్ నియమించే అవకాశముంది. ఫిబ్రవరి నుంచే కొత్త పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ మొదలుపెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రక్రియ అంతా.. ఫిబ్రవరిలో లోపు పూర్తవుతుందా.. లేదా.. ఇప్పటికే వాయిదా పడిన గ్రూప్ 2 పరిస్థితి ఏంటి ? గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను హైకోర్టు రద్దు చేయగా.. సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది TSPSC. ఆ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా.. మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తుందా. గ్రూప్ 4 రిజల్ట్స్ ప్రకటించి పోస్టింగ్స్ ఇస్తారా.. మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి అన్నదాపై.. మరో 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు.