Congress Manifesto : నేడు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకునేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది.

The ruling party in Telangana has released a special manifesto for the parliamentary elections
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకునేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఇవాళ శుక్రవారం ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి, PCC అధ్యక్షుడు రేవంత్రెడ్డి దీన్ని ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తుందనే విషయాలను ఈ మేనిఫెస్టో ద్వారా వివరించనున్నారు. గాంధీభవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.
టీపీసీసీ తెలంగాణ మేనిఫెస్టోలో హామీలివేనా..!
- ఐటీఐఆర్ ఏర్పాటు
- కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ
- హైదరాబాద్లో ఐఐఎం
- సైనిక్ స్కూళ్లు
- కేంద్రీయ విశ్వవిద్యాలయాల పెంపు
- నవోదయ విద్యాలయాల సంఖ్య
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం
SSM