Telangana Rythubandhu scheme : ఎక్కువ భూములుంటే రైతుబంధు కట్‌..!? బాంబు పేల్చిన కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చింది. నిజం చెప్పాలంటే ఇలాంటి పథకాలే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపాయి కానీ అన్నిటికీ పాజిటివ్‌, నెగటివ్‌ ఉన్నట్టే.. ఈ పథకానికి కూడా రెండు కోణాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2023 | 12:03 PMLast Updated on: Nov 05, 2023 | 3:04 PM

The Rythubandhu Scheme Specially Introduced By The Telangana Government Has Become A Super Success And Brs Has Stood At The Top Position In The State But Like Everything Else There Are Positive And Ne

తెలంగాణ ప్రభుత్వం (Telangana, government) ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు (Rythubandhu) పథకం ( scheme)  సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చింది. నిజం చెప్పాలంటే ఇలాంటి పథకాలే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపాయి కానీ అన్నిటికీ పాజిటివ్‌, నెగటివ్‌ ఉన్నట్టే.. ఈ పథకానికి కూడా రెండు కోణాలు ఉన్నాయి. ఈ పథకంలో ముఖ్యంగా వచ్చిన సమస్య కౌలు రైతులు. భూస్వాముల దగ్గర రైతులు పొలం కౌలు తీసుకుని పండించుకుంటారు. కానీ రైతుబంధు మాత్రం భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్లకు మాత్రమే వస్తుంది.

ఫైనల్‌గా అసలు పంట పండించే రైతుకు మాత్రం మిగిలేది శూన్యం. ఇదే విషయంలో చాలా కాలం నుంచి ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ భూములు ఉన్నవాళ్లకు రైతుబంధు అవసరం లేదంటూ వారిస్తున్నారు. రీసెంట్‌గా మై విలేజ్‌ షోతో వ్లాగ్‌ చేసిన కేటీఆర్‌.. (KTR) రైతుబంధు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వాదనతో తాను 100 శాతం ఏకీభవిస్తానంటూ చెప్పారు. వచ్చే టర్మ్‌లో ఎక్కువ భూములు ఉన్నవాళ్లకు రైతుబంధు ఇవ్వాలా వద్దా అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు.

ఇప్పటికి మాత్రం ఈ సమస్య పరిష్కరించేందుకు కాస్త కష్టంగా ఉందన్నారు. కౌలు వ్యవహారం అనేది రైతుకు భూ యజమానికి మధ్య ఉండే వ్యక్తిగత సంబంధం. అది ప్రతీ ఒక్కోలా మారిపోతోంది. ఇలాంటి విషయంలో ప్రభుత్వం ఓ నిర్ధిష్ట నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఇదే విషయాన్ని కేటీఆర్‌ చెప్పారు. కానీ నిజంగా పంట పండించే రైతులకు రైతుబంధు ఫలాలు అందాలనేదే తన ఆలోచన అంటూ చెప్పారు కేటీఆర్‌. గతంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్‌. పథకం ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి త్వరలో మరిన్ని మార్పులు చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా అందరికీ లాభం చేకూరే నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. దీంతో ఎక్కువ భూములు ఉన్నవారిని రైతుబంధు ఆపేస్తారా అనే చర్చ మొదలైంది. ప్రభుత్వం నిజంగా అదే నిర్ణయం తీసుకుంటుందా చూడాలి.