Lok Sabha Elections : దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్.. పోలింగ్ కు తప్పని ఎండ ముప్పు…
దేశవ్యాప్తంగా మొదలైన రెండో దశ లోక్‌సభ ఎన్నికలు.. ఇవాళ ఉదయం రెండో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 ఎంపీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.

The second round of polling across the country.
దేశవ్యాప్తంగా మొదలైన రెండో దశ లోక్‌సభ ఎన్నికలు.. ఇవాళ ఉదయం రెండో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 ఎంపీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో భాగంగా కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అసోం, బీహార్లలో 5 చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్లలో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయ్యింది. కాగా ఈ దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఉన్నారు.
రెండో దశ పోలింగ్కు ఎండ ముప్పు
పోలింగ్ జరగబోయే రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో గురువారుం నమోదైన ఉష్ణోగ్రతల లిస్టును ఐఎండీ విడుదల చేసింది. ఒడిశాలోని ఝర్సుగూడలో 43.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. కోల్కతాలో 40డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డెంది. దక్షిణ పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. అలాగే సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం చూపవచ్చంటూ అప్రమత్తం చేసింది.
SSM