YCP Ex Minister Roja : ఇండస్ట్రీకి దూరమైన రోజా… ఆఫర్ల కోసం ఆ పని చేస్తోందా…
ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలు మిగిల్చిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ (YCP) ని ఘోరాతిఘోరంగా ఓడించిన జనాలు.. కేవలం 11సీట్లకు పరిమితం చేశారు.
ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలు మిగిల్చిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ (YCP) ని ఘోరాతిఘోరంగా ఓడించిన జనాలు.. కేవలం 11సీట్లకు పరిమితం చేశారు. ఫ్యాన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 40శాతం ఓట్లు వచ్చి.. వైసీపీకి ఇంత ఘోరమైన పరాభవం ఏంటా అని.. ఇంకా ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆ లిస్ట్‌లో మాజీ మంత్రి రోజా (Ex Minister Roja ) కూడా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆమెకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. టీటీడీ (TDP) టికెట్ల విషయంలో ఇప్పటికే జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఇది కూడా చదవండి : Vallabhaneni Vamsi : దేశంలోనే ఉన్నాడా.. పారిపోయాడా.. వల్లభనేని వంశీ ఎక్కడ..
ఇలా పొలిటికల్‌గా చాలా డ్యామేజీ ఎదుర్కొంటున్న రోజాకు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సంబంధాలు దాదాపుగా కట్ అయిపోయాయ్. ఒకప్పుడు హీరోయిన్‌గా.. ఆ తర్వాత టీవీ షోల్లో జడ్జిగా మంచి పేరు సంపాదించుకున్న రోజాకు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఘోరమైన నెగిటివిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) .. చివరికి రజనీకాంత్ వరకు.. ప్రతీ ఒక్కరి మీద రోజా నోరుపారేసుకుంది. మళ్లీ తమదే అధికారం అనే భ్రమలో ఉండి అలా అన్నారో.. లేదంటే హైలైట్ కావాలని అలా మాటలు వదిలారో కానీ.. ఇప్పటికీ రోజా మాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయ్. టీడీపీ, జనసేన నేతలు ఫైర్ అవుతూనే ఉంటారు.
ఇది కూడా చదవండి : Wayanad : వాయనాడ్ లో సినిమా సీన్, ఆరుగురు ప్రాణాలు కాపాడటం కోసం…
రాజకీయంగా రోజా (Roja) మాటల సంగతి ఎలా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీ (Film Industry) లో పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్న వారిపై కూడా రోజా.. తన దూకుడు చూపించారు. ఇప్పుడు అదే ఆమెకు నెగిటివ్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి… ఇండస్ట్రీకి చెందిన హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేయడంతో… రోజాకు చిత్ర పరిశ్రమలో ఎవరూ సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం మిగిల్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న రోజా… టీవీ, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఐతే ఆమెకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. తెలుగులో అయితే పరిస్థితి మరింత దారుణమట.
ఇది కూడా చదవండి : Kedarnath Yatra : కేదార్ నాథ్ లో రెడ్ అలర్ట్.. కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత.. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు
ఎవరి కాల్ చేసి ఆఫర్ అడిగినా.. మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమిళనాడులో రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే అక్కడ కూడా సరైన రెస్పాన్స్ రావడం లేదనే రూమర్లు వినిపిస్తున్నాయ్. ఇందులో ఎంత నిజం ఎంత ఉందో తెలియదు కానీ, దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పాపం రోజా పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందా అంటూ జాలి పడేవాళ్లు కొందరయితే.. అధికారం ఉంది కదా అని ఎగిరిపడితే.. తర్వాత సీన్ ఇలానే ఉంటుంది మరి అంటూసెటైర్లు వేస్తున్న వాళ్లు మరికొందరు.