Modi, Mann Ki Baat : ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రారంభం.. మోదీ ఏం చెప్తున్నారు అంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ప్రారంభంమైయింది. ‘మన్ కీ బాత్’ అనేది భారత పౌరులతో కీలకమైన జాతీయ సమస్యలను చర్చించడానికి ప్రధానమంత్రి మోదీ వేదికగా ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 30, 2024 | 01:05 PMLast Updated on: Jun 30, 2024 | 1:05 PM

The Start Of Pm Modis Mann Ki Baat What Is Modi Saying

 

 

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాకా.. మాన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలి సారి. దీంతో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పబోతున్నారు అని దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా అసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇన్నాళ్లు మన్​ కీ బాత్​ కార్యక్రమం వాయిదా పడింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్​లో మాట్లాడుతున్నారు. ఈ మాన్ కీ బాత్ కార్యక్రమం 2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. అప్పటి నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి మోదీ తన మనసులోని మాటలను పంచుకుంటున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ప్రారంభంమైయింది. ‘మన్ కీ బాత్’ అనేది భారత పౌరులతో కీలకమైన జాతీయ సమస్యలను చర్చించడానికి ప్రధానమంత్రి మోదీ వేదికగా ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతుంది. జూన్ 18న, జూన్ 30న మన్ కీ బాత్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు PM మోడీ ప్రకటించారు. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్ ద్వారా లేదా 1800 11 7800లో సందేశాలను రికార్డ్ చేయడం ద్వారా ప్రజలు తమ ఆలోచనలను అందించాల్సిందిగా ప్రోత్సహించారు.

దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోకు ఉన్న 500 బ్రాడ్ కాస్టింగ్ సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 22 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, చైనీస్, అరబిక్ వంటి 11 విదేశీ భాషల్లోకి కార్యక్రమాన్ని ప్రసారం అవుతున్నాయి..

 

‘మన్ కీ బాత్’ 111వ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే…

 

  •  “ఈరోజు, మన రాజ్యాంగం మరియు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవి. ఇంత పెద్ద ఎన్నికలు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు. నేను. దీని కోసం ఎన్నికల కమిషన్‌ను \ ఓటింగ్ ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

 

  • ఆదివాసీ ప్రజలు జరుపుకునే ‘హూల్ దివాస్’ను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. విదేశీ పాలకుల దురాగతాలను తీవ్రంగా వ్యతిరేకించిన ధైర్య సిద్ధూ-కన్హుల అలుపెరగని ధైర్యంతో ఈరోజుతో ముడిపడి ఉందని ప్రధాని మోదీ అన్నారు.

 

  •  “ఈ రోజు, జూన్ 30 చాలా ముఖ్యమైన రోజు. మన గిరిజన సోదరులు \ సోదరీమణులు ఈ రోజును ‘హూల్ దివాస్’గా జరుపుకుంటారు.

 

  •  “వీర్ సిద్ధూ-కన్హు వేలాది మంది సంతాల్ సహచరులను ఏకం చేసి.. బ్రిటీష్ వారితో పోరాడారు. ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? ఇది 1855లో జరిగింది. అంటే 1857లో భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య సమరానికి రెండేళ్ల ముందు.. జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో మన గిరిజన సోదరులు \ సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. అని ప్రధాన మంత్రి తెలిపారు.