Robo Operation Fail : మహిళ ప్రాణం తీసిన సర్జికల్ రోబో ! చిన్న పేగుకు రంధ్రాలు పొడిచిన రోబో!
అత్యాధునిక వైద్యం... రోబో (Robo) సాయంతో ఆపరేషన్లు అని హాస్పిటల్స్ ప్రకటించుకుంటాయి. కానీ రోబోలతో చేసే ఆపరేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అమెరికా (America) లో ఓ సర్జికల్ రోబో చేసిన పెద్ద పేగు క్యాన్సర్ ఆపరేషన్ ఫెయిల్ (Cancer operation failed) అయింది. దాంతో ఓ మహిళ చనిపోయింది.
అత్యాధునిక వైద్యం… రోబో (Robo) సాయంతో ఆపరేషన్లు అని హాస్పిటల్స్ ప్రకటించుకుంటాయి. కానీ రోబోలతో చేసే ఆపరేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అమెరికా (America) లో ఓ సర్జికల్ రోబో చేసిన పెద్ద పేగు క్యాన్సర్ ఆపరేషన్ ఫెయిల్ (Cancer operation failed) అయింది. దాంతో ఓ మహిళ చనిపోయింది.
మనిషి చేసే పని మనిషే చేయాలి… అన్నింటికీ రోబోలు వాడితే ఎలా… అమెరికాలోని ఓ మహిళ పెద్దపేగు క్యాన్సర్ చికిత్స (Colon cancer treatment) కోసం వినియోగించిన రోబో ఆమె ప్రాణాలు తీసేసింది. ఆపరేషన్ పెద్ద పేగుకు అయితే… చిన్న పేగుకు రంధ్రాలు చేసిందనీ… దాంతో తన భార్య మరణానికి దారితీసినట్టు భర్త కోర్టులో కేసు వేశాడు. సర్జికల్ రోబోలను అమ్ముతున్న ఇంట్యూటివ్ సర్జికల్ (Intuitive surgical) అనే సంస్థ మీద 75 వేల డాలర్లు (అంటే దాదాపు రూ.62.26 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టును కోరారు. న్యూయార్క్ పోస్ట్ కథనం (New York Post article) ప్రకారం, సాండ్రా సుల్జర్ భర్త హార్వే సుల్జర్ ఇంట్యూటివ్ సర్జికల్’ అనే కంపెనీపై కోర్టులో ఈ కేసు ఫైల్ చేశాడు.
2021 సెప్టెంబర్ లో ఫ్లోరిడాలోని బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ హాస్పిటల్ లో సాండ్రా సుల్జర్ పెద్ద ప్రేగుకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు. రిమోట్ తో పనిచేసే డావిన్సీ అనే సర్జికల్ రోబోను డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు వాడారు. అది డాక్టర్లు ఆదేశించినట్టు కాకుండా చిన్న పేగుకు రంధ్రాలు చేసింది. ఆపరేషన్ తర్వాత ఆ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ… 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు.
ఆపరేషన్ చేసేటప్పుడు… కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ ను రోబో దెబ్బతీస్తుంది అన్నది కంపెనీకి తెలిసినా… ఆ సంగతి తమకు చెప్పలేదని మృతురాలి భర్త ఆరోపించారు. రోబోతో ఏర్పడిన గాయాలు, లోపాల గురించి కంపెనీకి వేలల్లో నివేదికలు అందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా గానీ ఆ రోబోను తయారు చేసిన కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. డావిన్సీ రోబో వాడకంపై డాక్టర్లు సరిగా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదన్నారు. అనుభవం లేని హాస్పిటల్స్ కు కంపెనీ రోబోలను ఎందుకు అమ్ముతోందని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు.