Ayodha Ram Mandir : రాముడి తల్లిని పూజించే గుడి.. అయోధ్యతో సమానమైన ఆలయం ఎక్కడంటే..

అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్. రాముడి అయోధ్యకు నడిచొచ్చిన వేళ.. మోదీ బాలరామున్ని ఎదుర్కొన్న వేళ.. కౌసల్యా కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ.. ప్రతీ ఘట్టం అమూల్యమే.. ప్రతీ సన్నివేశం అపురూపమే!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 22, 2024 | 04:33 PMLast Updated on: Jan 22, 2024 | 4:33 PM

The Temple Where Rams Mother Is Worshipped Where Is The Temple Similar To Ayodhya

అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్. రాముడి అయోధ్యకు నడిచొచ్చిన వేళ.. మోదీ బాలరామున్ని ఎదుర్కొన్న వేళ.. కౌసల్యా కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ.. ప్రతీ ఘట్టం అమూల్యమే.. ప్రతీ సన్నివేశం అపురూపమే! అయోధ్యతో పాటు.. దేశంలో చాలా పెద్ద రామాలయాలు ఉన్నాయి. దేవాలయాల విశాలత, కళాకృతులు దానికదే సాటిలేనివి. తెలంగాణలోని భద్రాచలంలో సీతా రామచంద్ర స్వామి దేవాలయం ఉంది. దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది రామాయణ కాలానికి సంబంధించింది అని నమ్ముతారు.

ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో రామరాజ దేవాలయం ఉంది. రాముడు రాజుగా కూర్చునే ఏకైక ఆలయం ఇది. అతనికి ప్రతిరోజూ గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇస్తారు. ఈ ఆలయంలో రాముడు తల్లి కౌసల్యతో పాటు.. సీత, లక్ష్మణ్, హనుమాన్, దుర్గతో పాటు సుగ్రీవుడిని కూడా పూజిస్తారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రామ్ తీరథ్ ఆలయం ఉంది. ఇది రామాయణ కాలానికి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన కథ.. రాముని కుమారులు లవకుశులకు సంబంధించినది. వాల్మీకి మహర్షి సీతకు ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఇదే అని ప్రతీతి. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కరువన్నూర్ నది ఒడ్డున శ్రీరామస్వామి దేవాలయం ఉంది. 6 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఇక్కడ ప్రతిష్టించారు. శివుడు, గణపతి మహారాజ్, కృష్ణుడు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. ఇప్పుడీ ఆలయాలన్నీ వైరల్ అవుతున్నాయ్. భక్తులంతా.. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.