Salman Khan: సల్మాన్ టైగర్ 3 పై ఆశలు అవసరమా..?
టైగర్ సిరీస్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్‌తో జత కట్టింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు.

The trailer of Salman Khan Katrina Kaif starrer Tiger 3 is creating a sensation
యశ్ స్పై యూనివర్స్ నుంచి టైగర్ జిందా హై.. వార్, ఆ మధ్య పఠాన్ లేటెస్ట్‌గా టైగర్ 3 ట్రైలర్‌తో వచ్చింది. సల్మాన్‌ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహా? 20 ఏళ్లపాటు జీవితాన్ని ఇండియా కోసం పణంగా పెడితే.. దేశద్రోహి ముద్ర పడిందా? ఇదే పాయింట్‌తో సల్మాన్ ‘టైగర్3’ ట్రైలర్ రిలీజైంది. ఏక్‌థా టైగర్.. టైగర్ జిందా హై’ తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్ టైగర్3పై ఆసక్తి నెలకుంది. సినిమా దీపావళి సందర్భంగా నవంబర్12న థియేటర్స్‌లోకి రానుండగా.. ముందుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించాడు.
టైగర్3లో సల్మాన్ రా ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్‌గా కనిపించాడు. 20 ఏళ్ల పాటు దేశానికి సర్వీస్ చేస్తే.. శత్రువు అని ముద్ర వేశారు. వెల్‌కం టు పాకిస్థాన్ అని ఇమ్రాన్ హష్మి డైలాగ్‌తో కథ టూకీగా చెప్పేశాడు దర్శకుడు. భజరంగీ భాయిజాన్ సెంటిమెంట్‌తో టైగర్3 కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో వున్నారు సల్మాన్ ఫ్యాన్స్. స్పై థ్రిల్లర్స్‌లో కనిపించే హై స్టాండర్డ్స్ యాక్షన్ సీన్స్ టైగర్3లోనూ కనిపిస్తున్నాయి. టైగర్ సిరీస్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్‌తో జత కట్టింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు.