Gaza War: గాజాలో కాల్పుల విరమణపై స్పందించిన ఇజ్రాయెల్, అమెరికా
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య గత 20 రోజులుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. గతంలో దొంగచాటుగా మిలిటెంట్లతో దాడులు పాల్పడిన హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. అందులో భాగంగా గాజాపై తీవ్రమైన కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ పధాని నెతన్యాహూ స్పందించారు.

The United Nations responded to the cease-fire on Gaza.. Israel does not back down
హమాస్ చేసిన పనికి ఇజ్రాయెల్ చేతిలో గాజా బలైపోతోంది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. భీకరమైన యుద్దం ధాటికి భవనాలు నేలకూలాయి. శిధిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. అయితే మానవతా సాయం గాజాకు అందాలంటే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కు పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. ఇజ్రాయెల్ – హమాస్ పై చేస్తున్న యుద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. ఒకవేళ కాల్పుల విరమణ పాటిస్తే అది హమాస్ కు లొంగిపోవడమే అవుతుందన్నారు. అంతేకాకుండా ఈ దాడులను నిలిపివేస్తే ఉగ్రవాదానికి లొంగిపోవాలని పరోక్షంగా పిలుపునివ్వడమే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి దాడులు ఆపితేనే గాజాకు మానవతా సాయం అందుతుంది. లేకుంటే తీవ్ర సంక్షోభానికి గురవుతుందని హెచ్చరించింది. దీనిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇజ్రాయెల్.
ఇదిలా ఉంటే గాజా కాల్పుల విరమణ వ్యవహారంపై అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్ దాడులు ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పడం తీవ్ర అభ్యంతరకరం అని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాల్పుల విరమణ సరైన నిర్ణయం అని అమెరికా భావించడంలేదని ఆ దేశ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. గాజాకు మానవతా సాయం అందడమే ముఖ్య ఉద్దేశ్యం అయితే ప్రత్యేకంగా యుద్ద విరమణ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందని భావించింది. దీంతో ఈ ఇరుదేశాల మధ్య తలెత్తిన యుద్దం ఇప్పట్లో సర్థుమణిగేలా కనిపించడం లేదు.
T.V.SRIKAR