Ravi Teja: వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో రవితేజ సందడ..
ఆదివారం జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రవితేజ లైవ్ షో చేయనున్నాడు. అందుకుసంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

The video is going viral that hero Ravi Teja will do a live show for Australia and India World Cup match
క్రికెట్ అభిమానులతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రవితేజ లైవ్ షో చేయనున్నాడు. అందుకుసంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
మాస్ మహారాజా చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో టైగర్ నాగేశ్వరరావు పై భారీ అంచనాలు ఉన్నాయి. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రమోషన్స్ స్పీడప్ చేశాడు మాస్ రాజా. రీసెంట్‌గానే ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్‌కు రానున్నాడు మాస్ మహరాజా.
ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు క్రికెట్ లైవ్ షోలో పాల్గొననున్నాడు రవితే. వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 8న అంటే, ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షోలో రవితేజ పాల్గొనున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇండియా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే. ఆస్ట్రేలియా మ్యాచ్‌తో వరల్డ్ కప్ వేట మొదలుపెట్టనుంది ఇండియా. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ లైవ్ షోలో సందడి చేయనున్నాడు రవితేజ. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా.. 12.30 గంటల నుంచే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో స్పెషల్ షో రానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ‘ఇలాఖా మనదే.. తడాఖా మనదే’ అనే వీడియో వైరల్ అవుతోంది. దీంతో టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మరింత బజ్ రావడం గ్యారెంటీ.